Massive fire at Miyapur Metro Rail Depot : జంట నగరాలాలో ఎంతో ప్రతిష్టాత్మికంగా చేపట్టి విజయవంతం గా నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రోజుకు లక్షల మంది ని వారిv వారి గమ్య స్దానలకు చేరుస్తూ రికార్డు లు సృష్టిస్తోంది. ఇప్పుడు ఫ్రీ బస్సు ల వల్ల జనం అంతా మెట్రో ను ఆశ్రయిస్తున్నారు.
ఇంత వరకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది హైదరాబాద్ మెట్రో. కాని ఈరోజు అకస్మాత్తుగా ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదం మియాపూర్ లో ఉన్న మెట్రో రైల్వే స్టేషన్ డిపోలో జరిగినట్లు సమాచారం అందుతోంది.
మెట్రో స్టేషన్ డిపోలో ఉన్న చెత్త డంపింగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగాయి అని ప్రత్యక్ష్య సాక్షులు చెప్పారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తానికి ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.