కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం.. బ్యాంకు ఖాతాలను నిలిపివేశారంటూ మండిపాటు..

Screenshot 2024 03 21 144323 కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం.. బ్యాంకు ఖాతాలను నిలిపివేశారంటూ మండిపాటు..

అగ్రనేతల సమావేశం:

మార్చి 21న పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మీడియా ముందు సమావేశమయ్యారు. పార్టీ చీఫ్ ఖార్గే, మాజీ చీఫ్ సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా సమావేశంలో మాట్లాడారు.
లోక్ సభ ఎన్నికల ముందు వీరు ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.

బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు – సోనియా గాంధీ

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బ్యాంక్ ఖాతాలను ఫ్రిజ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
పార్టీని ఆర్థికంగా దెబ్బతీయడం, ఇబ్బందులకు గురిచేసే లక్ష్యంతో ఇలాంటి పనులు చేస్తున్నారంటూ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ మండిపడ్డారు.

కావాలని ఎన్నికల ముందు గతాన్ని తవ్వి మరీ నోటీసులు జారీ చేస్తున్నారని ఇలాంటి చర్యలు దేశానికి, దేశాభివృద్దికి ఏ మాత్రం ఉపయోగకరం కాదని అన్నారు.
ఇక మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రధాని మోదిని తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే రాహుల్ గాంధీ కూడా ప్రధానిపై పలు ఆరోపణలు చేశారు. ఇక దీనిపై ప్రధాని స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

Leave a Comment