మెగాస్టార్ చిరంజీవి (Mega star) మనవరాలు , మెగా పవర్ స్టార రామ్ చరణ్ (Ram charan) , ఉపాసన(Upasana)ల గారాల పట్టి క్లింకార ( klinkaara)పుట్టిన వెంటనే సోషల్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్ గా మారిన విషయం తెల్సిందే. నేషనల్ లెవెల్ మీడియా సైతం క్లింకారని కవర్ చేసేందుకు పోటీ పడ్డాయి. కానీ ఎవరు క్లింకార ఫేస్ ను కాప్చర్ చేయలేకపోయారు.
అంతే కాదు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అధికారికంగా క్లింకార ఫేస్ ను ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. కానీ ఇవాళ చరణ్ బర్త్ డే సందర్భంగా క్లింకార ముఖం చూసే ఛాన్స్ దక్కింది. ఈ చిన్నారి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో మెగావారి గారాలపట్టి ఎంతో క్యూట్ గా కనిపించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan)పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా చరణ్, ఉపాసనల దంపతులతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ తిరుమల( Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే కూతురు క్లింకార తలనీలాలు వెంకటేశ్వరస్వామికి సమర్పించుకున్నారు. నిన్న రాత్రే రామ్ చరణ్ దంపతులు హైదరాబాద్ నుండి బయల్దేరారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట (Renigunta) ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. పుట్టిన రోజు కావడంతో రంగనాయకుల మండపంలో రాంచరణ్ దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అంతేకాదు చరణ్ దంపతులను ఫ్యాన్స్ కూడా ఘనంగా స్వాగతించారు.
కొన్నాళ్లుగా గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఈ రోజు బర్త్ డే సందర్భంగా కాస్త విరామం తీసుకుని తిరుమలకు చేరుకున్నారు. తమ అభిమాన స్టార్ ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకున్న దంపతులు కూతురు క్లింకార తలనీలాలు సమర్పించారు.
ఈ క్రమంలో ఉపాసన ఒడిలో క్లింకార ఉంది. మీడియా వారు మెగా ఫ్యామిలీని కవర్ చేస్తున్న సమయంలో క్లింకార ఫేస్ రివీల్ అయ్యింది. దీంతో ప్రస్తుతం క్లింకార ( klinkaara)వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. చిన్నారి ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. ఆమె చూపు లో మెరుపు ఉందని ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. మెగా ప్రిన్స్ క్లింకార ఫస్ట్ లుక్ అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. క్లింకార క్యూట్ లుక్స్ కి నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు.