Mega star Chiranjeevi and Ram Charan arrive in Ayodhya for Pran Pratishtha : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లమంది హిందువుల 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరబోతోంది. మరికొన్ని గంటల్లో అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది.
ఆధ్యాత్మిక శోభతో అయోధ్య నగరం కళకళలాడుతోంది. యావత్ ప్రపంచం రామనామ స్మరణలో మునిగిపోయింది. భారతదేశంలో ఉన్న ప్రతి ఆలయంలో రామనామ జపాలు, హోమాలు జరుగుతున్నాయి. రామయ్య ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్షంగా చేసేందుకు ఇప్పటికే వేలమంది భక్తులు అయోధ్య చేరుకున్నారు.
రాజకీయ నాయకులతో సహా సౌత్ సెలబ్రిటీలు అయోధ్య చేరుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబ సభ్యులు అయోధ్యలో సందడి చేస్తున్నారు. చిరంజీవి దంపతులతో పాటు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)లు రాములోరి వైభవాన్ని చూసేందుకు అయోధ్య తరలివచ్చారు.
ఇక వీరితో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajanikanth) స్టార్ హీరో ధనుష్ (Dhanush), బాలీవుడ్ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitab Bachhan)తో పాటు యువ హీరోలు జాకీ ష్రాఫ్ (Jackie Shroff), రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ,విక్కీ కౌశల్ ( Vicky Kaushal), వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi), అనుపమ్ ఖేర్ ( Anupam Kher), సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar),బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అలియా భట్ (Alia Bhatt), కత్రినా కైఫ్ (Katrina Kaif), కంగనా (Kangana)లు అయోధ్యలో మెరిసారు.
వీరితో పాటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)అయోధ్యకు చేరుకున్నారు. సెలబ్రిటీల రాకతో అయోధ్య ఎయిర్ పోర్టు కిక్కిరిసిపోయింది. సుమారు 100 ప్రైవేట్ విమానాలు అక్కడ ప్రత్యక్షమైనట్లు సమాచారం. ప్రస్తుతం అయోధ్యకు చేరుకున్న సెలబ్రిటీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Hanuman called me says Chiranjeevi : హనుమంతుడు నన్ను పిలిచాడు
అయోధ్య చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) జాతీయ మీడియాతో మాట్లాడారు.” భారతదేశంలో జరిగే ఈ మహోన్నతమైన కార్యక్రమానికి నేను రావడం చాలా అనందంగా ఉంది.
500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిందువుల కల ఇవాళ నెరవేరబోతుంది. ఈ దైవ కార్యక్రమంలో నా కుటుంబానికి స్థానం దక్కడం సంతోషం.
ఇంతటి అద్భుతమైన దైవకార్యానికి పూనుకున్న కేంద్ర సర్కార్ చొరవ చాలా గొప్పది. ఇవాళ రామ మందిర ప్రారంభోత్సవాన్ని దగ్గరుండి చూడటం నా అదృష్టం.
నేను అంజయ్యకు పరమ భక్తుడిని, ఆయనే నన్ను ఇక్కడికి నన్ను పిలిచాడు. ఈ క్షణాలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను”. అని చిరంజీవి భావోద్వేగమయ్యారు.
Waiting for Ram Mandir for many years: Ram Charan, ఎన్నో ఏళ్లగా రామ మందిరం కోసం ఎదురుచూస్తున్నా : రామ్ చరణ్
తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితోనే, రామ్‌చరణ్ (Ram Charan)అయోధ్య చేరుకున్నాడు. తర్వాత జాతీయ మీడియాతో చరణ్ మాట్లాడాడు.
“రామ మందిరం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను. ఈ మహత్తర కార్యంలో నేను ఓ భాగం కావడం చాలా ఆనందంగా ఉంది”. అని చరణ్ తెలిపాడు .
Bollywood celebrities at Ayodhya : అయోధ్యలో తళుక్కుమన్న బాలీవుడ్ సెలబ్రిటీలు
తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది అతిథుల లిస్టును రెడీ చేయగా అందులో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అగ్ర కథానాయకులు, డైరెక్టర్లు, సింగర్స్ పేర్లు ఉన్నాయి.
వీరిలో చాలా మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్ తారలు ఆయోధ్యలో సందడి చేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కంగనా రనౌత్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, సంజయ్ లీలా భన్సాలీ టాప్ సెలబ్రిటీలు రామ మందిరం ప్రారంభోత్సవాన్ని చూసేందుకు తరలివచ్చారు.
ముంబై నుంచి వీరంతా అయోధ్యకు చేరుకుంటున్న వీరి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.