Hanuman pre release event: హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‎కు మెగా స్టార్.

Hanuman is the mega star of the pre-release event.

Hanuman pre release event: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashanth Varma) ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘హనుమాన్’ (Hanuman).

సోషియోఫాంటసీ స్టోరీతో సూపర్ హీరో మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో యంగ్ హీరో తేజ సజ్జ (Tej Sajja)ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

తేజ సజ్జా, ప్రశాంత్ వర్మల కాంబినేషన్ లో ఇప్పటికే ‘జాంబిరెడ్డి'(Jombireddy)అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

అదే హిట్ ఫార్ములాతో ఇప్పుడు ‘హనుమాన్’ ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా అమృతా అయ్యర్‌ (Amrutha ayyar),

తేజ సజ్జా అక్క పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalakshmi Sharath Kumar)లతో పాటు వినయ్‌ రాయ్‌ (Vinay Roy), సముద్రఖని (Samudrakhani), రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ వరల్డ్ మూవీగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 11 భాషల్లో మూవీ రిలీజ్ కాబోతోంది.

విడుదల డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. విజువల్స్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని ట్రైలర్ ని బట్టి చెప్పవచ్చు.

తాజాగా ‘శ్రీరామ దూత స్తోత్రం’ పాటను విడుదల చేశారు. ఇకపోతే హనుమాన్ కి సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవేంట్లో అంజనీ పుత్రుడు సందడి చేస్తాడని తెలుస్తోంది.

Megastar chief guest for pre-release event : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా మెగాస్టార్

పాన్ వరల్డ్ మూవీగా హనుమాన్ (Hanuman) వస్తుండటంతో ప్రీ రిలీజ్ ఉత్సవ్‏ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

హైదరాబాద్‌(Hyderabad)లోని ఎన్ కన్వెన్షన్ హాల్‏లో జనవరి 7 సాయంత్రం 6 గంటలకు ఈ మెగా ప్రీ రిలీజ్ ఉత్సవన్ (Mega Pre release utsav)ను ప్లాన్ చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

megastar chiranjeevi indian film personality iffi sixteen nine Hanuman pre release event: హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‎కు మెగా స్టార్.

అంతేకాదు ఈ గ్రాండ్ ఈవెంట్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సమాచారం.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో మెగాస్టార్ వస్తున్నారని అనౌన్స చేయకపోయినా మెగా ప్రీ రిలీజ్ అంటూ ఓ హింట్ ఇచ్చారు. దాంతో చిరంజీవి ఈవెంట్ కు ముఖ్య అతిథి అని ఫిక్స్ అవుతున్నారు.

Theater issue between Hanuman and Guntur Karam : హనుమాన్, గుంటూరు కారం మధ్య థియేటర్ల సమస్య

సంక్రాంతి పండుగన సినిమాల సందడి మామూలుగా లేదు బడా హీరోల సినిమాలన్నీ ఈ సంక్రాంతికే థియేటర్ల వద్ద సందడి చేయబోతున్నాయి.

1532972 gk Hanuman pre release event: హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‎కు మెగా స్టార్.

మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్న గుంటూరు కారం(Guntur Karam)తో పాటు యంగ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న హనుమాన్ (Hanuman) మూవీ కూడా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.

ఈ క్రమంలో గుంటూరు కారం , హనుమాన్ మధ్య థియేటర్ల సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలో అందరి దృష్టి దిల్ రాజు(Dil Raju)పై పడుతోంది.

గుంటూరు కారం సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో హనుమాన్ మూవీకి పదుల సంఖ్యలో కూడా థియేటర్లు దొరకడం లేదని టాక్ వినిపిస్తోంది.

అలా దిల్ రాజు మీద ఇప్పుడు ఎక్కువగా డిస్కషన్ జరుగుతోంది. ఈ క్రమంలో హనుమాన్ విషయంలో మెగాస్టార్ కలుగజేసుకుని ఈ సమస్యను సాల్వ్ చేయాలని సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపించింది.

అలాంటి తరుణంలోనే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథి అనే న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. హనుమాన్ కోసం మెగాస్టార్ వస్తున్నాడని,

థియేటర్ల ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రంమలో చిరంజీవి హనుమాన్ భక్తుడని అందుకే అందుకే హనుమాన్ సినిమాకు ఇలా సాయం చేసేందుకు చూస్తున్నాడని మరికొందరు అంటున్నారు.

Chiranjeevi as Hanuman : హనుమాన్ పాత్రలో చిరంజీవి

హనుమాన్ (Hanuman) సినిమాలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) భాగం కాబోతున్నట్లు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

hanuman 1704280080 Hanuman pre release event: హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‎కు మెగా స్టార్.

హనుమాన్ క్యారెక్టర్ లో చిరంజీవి కనిపించనున్నారన్న టాక్ బాగా వినిపిస్తోంది. అయితే ఈ న్యూస్ పై ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

జాంబిరెడ్డి తర్వాత ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma)తీస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం ఫ్యామిలీ అడియన్స్ తె సహా యూత్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా చిరంజీవి కళ్ల మీద నెట్టిట్లో డిస్కషన్ జరుగుతోంది. హనుమాన్ మూవీలో చిరంజీవి నటించాడా? లేదా? అనే న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.

అందుకే ఇప్పుడు ఇలా ఈవెంట్‌కు చిరంజీవి వస్తున్నారని అంటున్నారు. ఒక వేళ చిరంజీవి గనున హనుమాన్ మూవీలో కనిపిస్తే మాత్రం మూవీ లెక్క వేరేలా ఉంటుందని అంటున్నారు.

ప్రశాంత్ వర్మ సైతం ఈ విషయంపై సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. జనవరి 7న జరిగే మోగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయంపై ఏమైనా లీక్స్ ఇస్తాడా అన్నిది వేచి చూడాల్సిందే.

Leave a Comment