Vishwambhara : త్రిషకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్

9a790803 e671 4d63 8612 19550eedba70 Vishwambhara : త్రిషకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) స్టార్ బ్యూటీ త్రిష(Trisha ) కాంబోలో వస్తున్న మూవీ విశ్వంభర (Vishwambhara).’బింబిసార’ (Bimbisara) ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ(Vasista) ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్
జరుగుతోంది. మేకర్స్ కూడా మూవీ కి సంబంధించి రోజుకో అప్డేట్ అందిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. త్రిష తో పాటు ఇంకా ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో కనిపించునున్నారు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటి త్రిషకు ఓ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ కాస్ట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ గిఫ్ట్ ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

త్రిషకు చిరు కానుక :

ఈ మధ్యనే విశ్వంభర (Vishwambhara) షూటింగ్ ప్రారంభమైంది. సంక్రాంతి నాటికి సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పడంతో శరవేగంగా షూట్ జరుగుతుంది. నటి త్రిష (Trisha)సెట్స్ పై అడుగుపెట్టింది.

ఈ క్రమంలో చిరంజీవి (Chiranjeevi)త్రిషకు వెల్కమ్ చెబుతూ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. . అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి..ఆ గిఫ్ట్ ఓ ఖరీదైన టెంపరేచర్ కంట్రోల్డ్ బాటిల్. దీనిని మనకు తగ్గ టెంపరేచర్ లో ఉంచుకోవచ్చు.. అంతేకాదు ఆ బాటిల్ పై హలో త్రిష అని కూడా వస్తుంది . దీంతో ఈ గిఫ్ట్ తనకు బాగా నచ్చిందని త్రిష ఆ గిఫ్ట్ ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. థ్యాంక్యూ చిరు సర్ అని తెలిపింది.

524c2a01 b8bb 48a3 94e3 62dbf7eb12bd Vishwambhara : త్రిషకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్

విశ్వంభర నుంచి మరో క్రేజీ అప్డేట్ :

‘విశ్వంభర’ (Vishwambhara)మూవీలో మెగాస్టార్ డ్యుయల్ రోల్ చేస్తున్నారట. ఆయన పాత్రలో రెండు రకాల షేడ్స్ ఉంటాయని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చిరంజీవి(Chiranjeevi)తో పాటు త్రిష కూడా డ్యూయల్ రోల్ లో కనిపించనుందని సమాచారం. ఫాంటసీ చిత్రంగా వస్తున్న విశ్వంభరలో త్రిష (Trisha)లుక్ మెస్మరైజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.

తమ తెలుగు సినిమాల్లో మామూలుగా హీరోలు డ్యూయల్ రోల్ చేయడం సహజమే కానీ హీరోయిన్లు డ్యూయల్ రోల్ చేయడం చాలా అరుదు. అంతే కాదు త్రిష కూడా ఇప్పటి వరకు డ్యుయల్ రోల్ చేయలేదు. ఇదే ఆమెకు ఫస్ట్ టైం. అందులోనూ మెగాస్టార్ సినిమాలో కావడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు ఈ అప్ డేట్ పై స్పందించలేదు.

రూ.200 కోట్ల భారీ బడ్జెట్ :

మెగాస్టార్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). యూవీ క్రియేషన్స్ (UV Creations)నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. భారీ గ్రాఫిక్స్ ఉండబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్టు కోసం నిర్మాతలు ఖర్చుకు వెనకాడటం లేదని సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే సంవత్సరం సంక్రాంతికి విశ్వంభరను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a Comment