vishwambhara : ‘విశ్వంభర’ స్టోరీ లీక్.. ముల్లోకాలను రక్షించే వీరుడిగా చిరు

vishwambhara 1024x576 1 vishwambhara : 'విశ్వంభర' స్టోరీ లీక్.. ముల్లోకాలను రక్షించే వీరుడిగా చిరు

గాడ్ ఫాదర్(God Father), వాల్తేరు వీరయ్య (Waltheru Verraiyya), భోళా శంకర్ (Bhola Shankar) వంటి సినిమాలు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. ఈ చిత్రాలు స్క్రీన్ మీద పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దీంతో ఈ సారి చేసే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మెగాస్టార్ మైండ్ లో బాగా ఫిక్స్ అయ్యారు.

అందుకే వైవిధ్యమైన కాన్సెప్ట్ తో విశ్వంభర (Vishwambhara) అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ డైరెక్టర్ వశిష్ట (vasista)తెరకెక్కిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా చిరు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే కొందరు విశ్వంభర ఓ యోధుడి కథ అని అనుకుంటే, మరికొందరు ఇదొక సోషియో ఫాంటసీ చిత్రం అని భావిస్తున్నారు.

చిరు-త్రిషల మధ్య క్రేజీ సీన్స్ :

అయితే ఇప్పుడు విశ్వభర (Vishwambhara)కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో చిరు ఒక్కరే కాదు ఆయనతో పాటు ముగ్గురు టాలీవుడ్ యంగ్ హీరోలు నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక చిరుకు జోడీగా కోలీవుడ్ నటి త్రిష (Trisha) నటిస్తుండగా మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఈ మూవీలో కనిపించనున్నారు.

సురభి (Surabhi), ఇషా చావ్లా (Isha Chawla), అషికా రంగనాథ్‌ (Ashika Ranganath)లు కీలక పాత్రలు కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి(Chiranjeevi)కి చెల్లెల్లుగా హీరోయిన్లు సురభి, ఈషా చావ్లా, అషికా రంగనాథ్‌లు కనిపించనున్నారు. ఈ మధ్యనే విశ్వంభర షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ త్రిషపై కొన్ని క్రేజీ సీన్లను షూట్ చేశారట.

విశ్వంభరలో చిరు ఓ సామాన్యుడు :

విశ్వంభర (Vishwambhara) విజువల్ వండర్‌గా రాబోతోంది. ఈ సినిమా కథ మొత్తం ముల్లోకాల మధ్య సాగుతుందని టాక్ . సిస్టర్ సెంటిమెంట్ తో పాటు వారి మధ్య సాగే లవ్ స్టోరీలో ఈ మూవీకి హైలెట్‌గా నిలువనున్నాయి. ఇప్పటికే చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి (Jagadekaveerudu Athilokasundari), యముడికి మొగుడు (Yamudiki Mogudu)వంటి ఫాంటసీ సినిమాల్లో నటించి హిట్ కొట్టారు. ఇప్పుడు విశ్వంభరతో మరోసారి అలరించేందుకు రెడీ అయ్యారు.

ఈ సినిమాలో చిరు దొరబాబు అనే క్యారెక్టర్ పోషిస్తున్నారు. అయితే ఈ క్యారెక్టర్ కు పెద్దగా శక్తులు ఉండవు. సామాన్య వ్యక్తిలాగా కనిపిస్తాడట. ఒక సామాన్యుడు ముల్లోకాలను రక్షించే వీరుడిగా ఎలా మారుతాడు అనేది కాన్సెప్ట్.

చిరు ఫ్యాన్స్‎కు పూనకాలే:

ఈ చిత్రంలో చిరంజీవి(Chiranjeevi) డైలాగులన్నీ గోదావరి జిల్లా యాసలో ఉంటాయట. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఓ ఒక భారీ ఫైట్ సీన్ చిరంజీవి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందని లీకులు వినిపిస్తున్నాయి. చిరు భీకరమైన పోరాటం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందట. అందరికీ గూస్‌బంప్స్ రావడం ఖాయమని సమాచారం. మొత్తానికి విశ్వంభర ( Vishwambhara)ఇంకా రిలీజ్ కానే లేదు కానీ భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Leave a Comment