Chiranjeevi: నా గుండె పిండేసినట్టయింది. ఆ రోజు అన్నం కూడా తినలేదు

website 6tvnews template 2024 04 01T130437.236 Chiranjeevi: నా గుండె పిండేసినట్టయింది. ఆ రోజు అన్నం కూడా తినలేదు

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇండస్ట్రీ పేరు చెబితే ముందుగా చిరంజీవి పేరే వినిపిస్తుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఎన్నో అవమానాలను తట్టుకుని ఇండస్ట్రీలో ఇప్పుడు మకుటం లేని మహారాజుగా కొనసాగుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వారికి చిరంజీవి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ మెగా స్టార్ గొప్ప హ్యూమన్.

సాయం అని ఎవరు తలుపుతట్టినా వెనుకాడరు. ప్రత్యేకంగా పేదవారి కోసం ఓ బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే చిరు ఈ స్థాయికి అంత ఈజీగా రాలేదు. ఆయన జీవితంలో ఎన్నో భాదకరమైన రోజులు ఉన్నాయి. తాజాగా ఆ విషయాలనే తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు మెగాస్టార్. లేటెస్టుగా ఓ ఈవెంట్ లో చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన కెరీర్ గురించి ,అవమానాల గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యారు.

రౌడీ బాయ్ తో మెగాస్టార్ ముచ్చట :

డిజిటల్ మీడియా ఫెడరేషన్ అంటూ జరిగిన ఓ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో విజయ్ చిరంజీవిని ఎన్నో క్వశ్చన్స్ అడిగి ఆయన గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను తెరముందుకు తీసుకువచ్చాడు. కెరీర్ లో రాణించాలనుకునే వారికి చిరంజీవి ఎన్నో విలువైన సూచనలు, సలహాలను ఇచ్చారు. మెగాస్టార్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమాన సంఘటనలు, నిరుత్సాహ పడ్డ ఘటనల గురించి చెప్పడంతో పాటు సక్సెస్ వైపు వెళ్లేందుకు ఆయన ఎలాంటి ఫార్ములా ఫాలో అయ్యారో చెప్పుకొచ్చారు.

ఆ రోజు అన్నం తినలేదు :

న్యాయం కావాలి (Nyayam Kavali) సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఘటన గురించి ఎంతో ఎమోషనల్ అయ్యారు చిరంజీవి. ఈయన మాట్లాడుతూ…” అప్పట్లో సీనియర్ నటి
శారద (Sarada) గారు చేస్తున్న సినిమా న్యాయం కావాలిలో నటించాను. శారద గారు చాలా గ్యాప్ తర్వాత ఆ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో ఓ కోర్ట్ సీన్ ఉంది. దాని షూటింగ్ జరుగుతున్నప్పుడు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి బోనులో నిల్చోమని చెప్పాడు.

ఈ సీన్ జరుగుతున్నప్పుడు కనీసం 400 మంది ఉన్నారు. నేను వెళ్లి బోనులో నిల్చున్నాను. అంతలోనే ప్రొడ్యూజర్ క్రాంతి కుమార్ (Kranthi Kumar) “ఏంటండి మిమ్మల్ని కూడా స్పెషల్ గా పిలవాలా..? వచ్చి ఇక్కడ పడి ఉండలేరా..? మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా.? అని అందరూ చూస్తుండగానే గట్టిగా అరిచేశాడు. ఆ మాటలతో నా గుండె పిండేసినట్లైంది. ఆ బాధతో ఆ రోజు భోజనం కూడా చేయలేదు.

ఆ అవమానమే నా ఎదుగుదలకు మెట్లు :

అయితే ఆ రోజు ఈవినింగ్ క్రాంతి కుమార్ నాకు కాల్ చేశారు. అలా ఎందుకు జరిగిందో వివరణ ఇచ్చారు. శారదా మీద ఉన్న చిరాకుతో నా పై అరిచానని చెప్పారు. అయితే అది పద్ధతి కాదని చెప్పాను. అంత మంది ముందు అరవడం కరెక్ట్ కాదని అన్నాను. అప్పుడు నాకు జరిగిన ఆ అవమానమే నాలో కసిని పెంచింది. నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అన్న మాట నాకు మైండ్ లో బాగా ఫిక్స్ అయ్యింది. నేను ఎలాగైనా సూపర్ స్టార్ అయ్యి చూపిస్తా అని డిసైడ్ అయ్యాను. ఆ అవమానమే నా ఎదుగుదలకు మెట్లుగా వాడుకున్నాను.

ఆ తర్వాత అలాంటివి నా కెరీర్ లో చాలా ఎదురయ్యాయి. వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇప్పుడు మెగాస్టార్ గా మీ మనసుల్లో ఉన్నాను అని చిరంజీవి తెలిపారు. ఇక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర (Vishwambhara) సినిమా చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ వశిష్ట (Vasista) తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడీగా త్రిష (Trisha)నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్టాఫ్ షూటింగ్ పూర్తైంది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Leave a Comment