Megastar Chiranjeevi wishes CM: తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ అభినందనలు…

6tv projects Megastar Chiranjeevi wishes CM: తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి మెగాస్టార్ అభినందనలు…

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తారీఖున లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ప్రమాణస్వీకారం చేసాడు.

భారత గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించింది.
ఈ ప్రమాణస్వీకారానికి కాంగ్రేస్ పార్టీ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా ప్రముఖులు వచ్చారు.

ఈ క్రమంలో కొత్త సీఎం అయిన రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

” తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మిగిలిన కొత్త ప్రభుత్వంలోని సభ్యులందరికి హార్దిక శుభాకాంక్షలు..

మీ నాయకత్వంలో రాష్ట్రము అత్యున్నత స్థానానికి వెళ్లాలని, మరింత అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను ” అంటూ ట్వీట్ లో రాసారు.

ఇక ప్రమాణస్వీకారంలో రేవంత్ రెడ్డితో పాటుగా 11 మంది మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చేసారు.
సీఎంగా మొదటి భాద్యత స్వీకరిస్తూ, ఆరు గ్యారెంటీల తొలి ఫైల్ పైన సంతకం చేసాడు రేవంత్ రెడ్డి.
రజిని అనే ఒక దివ్యంగురాలికి ఉద్యోగ నియామకం పైన సంతకం చేసాడు.

లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరిగింది.
హైదరాబాద్ నుంచే కాదు అనేక జిల్లాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంకి వచ్చారు.

కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి వచ్చారు.

Leave a Comment