Metro Route Nagole To Airport: హైదరాబాద్(Hyderabad) నగరంలో మెట్రో రెండు మూడో దశ పనుల విషయంలో కొంత స్పష్టత వచ్చినప్పటికీ శంషాబాద్ విమానాశ్రయాని(Samshabad Airport)కి వెళ్లే మార్గం పై మాత్రం తర్జన భర్జన జరుగుతూనే ఉంది.
కానీ ఈ విషయంలో ఇప్పుడు ఒక కొత్త రూట్ గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. అదే నాగోల్(Nagole) నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్.
ఇది నాగోల్ నుండి బయలుదేరి, ఎల్బీనగర్(LB Nagar), చంద్రాయణ్ గుట్ట(Chandrayan Gutta), మైలార్దేవ్ పల్లి(Mailardevpalli). పి 7(P 7) మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటుంది.
కొత్తగా ప్రతిపాదించిన ఈ మార్గమైతేనే బాగుంటుందని భావిస్తోందట యంత్రాంగం. ఎంజీబీఎస్(MGBS) – ఫలక్‌నుమా(Falaknuma)
చంద్రాయణగుట్ట – మైలార్‌దేవ్‌పల్లి – విమానాశ్రయం మార్గంతో పోల్చి చూస్తే నాగోల్ మార్గం నుండే ఎయిర్ పోర్ట్ కి వెళ్లే వారి సంఖ్యాఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
మార్గం బాగా ఇరుకు – Narrow Route
పైగా ఫలక్‌నుమా నుండి చాంద్రాయణ గుట్ట వరకు వచ్చే మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది. అదీకాక ఈ మార్గంలో మెట్రో నిర్మాణం చేపట్టాలంటే అక్కడ ఉన్న ఫ్లై ఓవర్ మీదుగా మలుపు తీసుకుకుని మెట్రో వంతెన కట్టాలి.
కాబట్టి అంత సాహసం చేయడం కన్నా కూడా నాగోల్ నుండి వచ్చే రూట్ అయితే ఫ్లై ఓవర్ తో సమాంతరంగా ప్రయాణిస్తుంది. పైగా అది మెట్రోకీ లాభసాటి కూడా, నాగోల్ మార్గం నుండి విమానాశ్రయానికి వెళ్లే వారి సంఖ్యా కూడా ఎక్కువగా ఉంటుంది.
మొత్తం 5 ఫ్లై ఓవర్లు ఉన్నాయి : Total Five Flyovers Are There
ఇక ఈ నిర్మాణాలను ప్రభుత్వం అలాగే ప్రయివేటు కంపెనీల భాగస్వామ్యంలో ఉండే విధంగా చేపట్టాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది.
ఓకే వేళ ఎవ్వరు అందుకు సిద్ధంగా లేకపోతె పూర్తి నిర్మాణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. అయితే నిర్వహణ బాధ్యతను మాత్రం ప్రవైటు కంపెనీలకే కట్టబెడుతుంది.
అయితే ఈ నాగోల్ – ఎయిర్ పోర్ట్ మార్గంలో మొత్తం 5 ఫ్లై ఓవర్లు ఉన్నాయి. వాటి పక్కాగా మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలి, అది కొంత కష్టం తో కూడుకున్న పని
పైగా కొత్త దూరం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక నాగోల్ నుండి ఎల్బీనగర్ వరకు ఉన్న దూరం చుస్తే 5 కిలోమీటర్లు, ఈ మార్గం గతంలోనే ప్రతిపాదించారు కూడా.