ఇక పథ బస్తి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీనికి కారణం ఆ ప్రాతం లో మెట్రో సేవలు అందుబాటులోకి రావడమే. ఈ నెల మార్చి 7 న తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదటి దశ పనులకు శంఖుస్దాపన జగరగనున్నది. దాదాపు 2,000 కోట్లతో MGBS నుండి ఫలక్ నామ వరకు 5.5 కేలోమీటర్లు మేర మెట్రో నిర్మాణం పనులు జరుగుతాయి.
అయితే మెట్రో కు ఆటంకం గా ఉన్న రోడ్డు ను విస్తరించాల్సి ఉంది అందుకు ఇరువైపులా కొన్ని నిర్మాణాలను తొలగించాలి. అయితే MGBS పరిధిలో కొంత వరకే నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. ఇక కొత్త గా నిర్మిస్తున్న మెట్రో వల్ల సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్ గంజ్, ఫలక్ న్యుమా ప్రాంతం లో స్టేషన్ రావడం వల్ల ఆ ప్రాంత పౌరులు కు ట్రాఫిక్ కస్టాలు తీరినట్లే అని చెప్పాలి. ఇక రెండో దశ లో ఫలక్ న్యూమా నుండి రాజీవ్ గాంధి ఎయిర్ పోర్ట్ వరకు చేపడతారు.