మిచౌంగ్ ‘తుఫాను తో రైతులకు కష్టాలు….. ప్రభుత్వానికి చంద్రబాబు చూచనలు..
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భారీగా కురుస్తున్నవర్షాల వలన సూళ్ళూరుపేట డివిజన్ లో ఉన్న కాళంగి నది, పాముల కాలువ యొక్క ప్రవాహ ఉదృతి బాగా పెరిగిపోయింది.
పాముల కాలువ చుట్టూ ఉన్న ప్రాంతం, కాదలూరు గ్రామానికి వెళ్లే రోడ్డు, తారకేశ్వరా టెక్టైల్ పార్కు కంపెని దగ్గర, మొదలైన ప్రాంతాలలో వరద నీరు భారీగా ప్రవహిస్తుంది.
రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం అందడం తో ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని….ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.
గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా…ప్రభుత్వం సరైన రీతిలో స్పందించ లేదని అయన అన్నారు. ధాన్యం కోనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని…సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని….ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని తెలిపారు. తుఫాను బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గారు కోరారు…
అదేవిధంగా, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు, తుఫాను బాధితులకు అండగా నిలవాలని చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. పలు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది…
బాధిత వర్గాలకు అండగా ఉండాలని, చేతనైన సాయం అందించాలని చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలకు సమాచారాన్ని అందించారు.