Adulterated Milk: యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్స్​తో పాలను కల్తీ చేస్తున్నారు.

Milk is adulterated with urea and hydrogen peroxide chemicals.

Adulterated Milk: యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి కెమికల్స్​తో పాలను కల్తీ చేస్తున్నారు.

ఈ ప్రపంచంలో రోజు రోజు కి జనాబా విపరీతంగా పెరిగిపోతుంది. దానికి తగ్గట్టుగానే వారి నిత్యవసారాలకు కావలసిన ఉత్పత్తులకు గిరాకి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది.

దానికి తగ్గట్టు ఆహార ప్రతీ ఆహార పదార్ధం కూడా అదే స్థాయిలో ఉత్పత్తి కావాలి. కానీ, ఇది జరగడం లేదు. దానికి తోడు మార్కెట్ లో లభించే పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి. వీటిలో ముఖ్యమైనది పాలు.

వీటిలో జరిగినంత కల్తీ మరే ఆహార పదార్ధం లో జరగడం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ఎంతో ప్రేమగా తాగుతారు. కానీ, ఈ పాలు పెద్ద ఎత్తులో కలిషితం అవుతున్నాయి. వీటితో పాటు

మంచి నీళ్లు, కారం, నెయ్యి, వంటనూనెలు, పొడులు, మసాలా దినుసులు… ఇలా మార్కెట్లో దొరికే పదార్థాలన్నీ చాలా వరకు కల్తీ ఉత్పత్తులతో ప్రత్యేక్షమౌతున్నాయి. పాలు, పాలతో తయారుచేసే ఉత్పత్తుల కల్తీ ఈ మధ్య కాలంలో బాగా కూడా కల్తీ అవుతున్నాయి.

కొందరు దుర్మార్గులు అడ్డదారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించడానికి యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి కెమికల్స్​తో కల్తీ పాలు తయారు చేసి ప్రజల జీవితాలతో, వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.

అయితే, ఈ కెమికల్స్ పాలలో నీళ్లలా కలిసిపోవడంతో కల్తీ పాలని గుర్తించడం కష్టంగా మారుతోంది. దీంతో పాలు కల్తీ అయ్యాయో లేదో తెలుసుకోలేక సామాన్య ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.

Add a heading 2023 12 18T165414.769 Adulterated Milk: యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ కెమికల్స్​తో పాలను కల్తీ చేస్తున్నారు.

ఆసుపత్రి పాలవుతున్నారు. అంతేకాదు, చిన్న పిల్లలు ఈ పాలను తాగి ఎన్నో అంతుచిక్కని రోగాల భారిన పడుతున్నారు. మరికొంతమంది పిల్లలైతే ఈ కల్తీ పాలు తాగాలంటే భయపడుతున్నారు.

అందుకే, ఇలాంటి భయంకరమైన కల్తీ పాలను గుర్తించడం పైన ప్రతి ఒక్క కుటుంబం అవగాహన పెంచుకొవాలి. ఆ పాలు కల్తీనా? కాదో తెలుసుకోవాలంటే ఒకప్పుడు ల్యాబ్‌లో పరీక్ష చేయించి, ఆ రిజల్ట్స్ వచ్చేదాకా ఎదురుచూడాల్సి వచ్చేది. అంతేకాదు, అది ఖర్చుతో కూడుకున్నపని.

ఇలాంటి సమస్యలన్నిటిని దృష్టిలో ఉంచుకొని బెంగళూరు కు చెందిన ఐఐఎస్​సీ శాస్త్రవేత్తలు.. ఇంట్లోనే ఉండి ఈజీగా కల్తీ పాలను గుర్తించే విధానాన్ని కనిపెట్టారు. మీరు రోజూ తాగే పాలు స్వచ్ఛమైనవో? కావో? ఇలా చెక్ చేయండి.

మీరు స్వచ్ఛమైన పాలను వేడి చేస్తున్నట్లయితే పాల మధ్యలో బుడగలా వస్తుంది. అలాగే, అక్కడే మరుగుతున్నట్లుగా కనిపిస్తుంది.అదే కల్తీ పాలను వేడి చేస్తున్నట్లయితే..

ఈ ప్రక్రియ అనేది స్థిరంగా ఉండదు. మీరు మిల్క్ హీట్ చేస్తున్న పాత్ర అంచుల వరకు పాలు మరుగుతాయి. అయితే, ఇది పాలల్లో నీళ్లు ఎంత కలిపారన్నదాన్ని బట్టి మారుతూ ఉంటుందనే విషయం మీరు గురుతుంచుకోవాలి.

ఒకవేళ యూరియాతో పాలను కల్తీ చేసినట్టు అయితే ఆ పాలు ఆవిరి కావు. గిన్నె అంచుకు చుక్కల్లాగా అంటుకుపోతాయి. మీరు వాడే పాలల్లో 30 శాతం కంటే ఎక్కువ నీరు కలిపినా.. 0.4 శాతం యూరియా కలిసినా ఈజీగా గుర్తించవచ్చని ఐఐఎస్​సీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Leave a Comment