Tamannaah Bhatia hot looks: మిల్కీ బ్యూటీ వెరీ హాట్…ఆ నడుమేంటి భయ్యా.

Milky beauty very hot...that waist is scary.

Tamannaah Bhatia hot looks: మిల్కీ బ్యూటీ వెరీ హాట్…ఆ నడుమేంటి భయ్యా.

తమన్నా భాటియా అద్భుతమైన నటి మాత్రమే కాదు ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఓవైపు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూనే మరోవైపు ఫ్యాషన్ ఫోటో షూట్లతో నెట్టింట్లో చెలరేగిపోతోంది.

మిల్కీ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో అద్భుతమైన ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరిస్తోంది. ట్రెండ్స్ కు తగ్గట్లుగా, తమన్నా తన ఫ్యాషన్ సెన్స్‌తో ఫిదా చేస్తోంది.

ఈ నటి తాజాగా అదిరిపోయే చీరకట్టులో కనిపించి ప్రేక్షకులను మెస్మెరైజ్ చేస్తోంది. తన పాల మీగడ లాంటి అందాలతో పరేషాన్ చేస్తుంది తమన్నా.

చీరకట్టుతో మిల్కీ బ్యూటీ సోషల్ మీడియాలో మంటలు రేపుతోంది. వరుసగా విభిన్న భంగిమల్లో దిగిన ఫోటోలను షేర్చేస్తూ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

డీప్ నెక్ లైన్ సన్నటి స్ట్రిప్స్ కలిగిన ట్రెండీ బ్లౌజ్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా హెవీ ఎంబ్రాయిడీ డీటైల్స్ తో వచ్చిన చీరను కట్టుకుని అందరినీ అట్రాక్ట్ చేసింది తమన్నా.

చీరకట్టులో తన నడుము అందాలను చూపిస్తూ హీట్ పెంచింది. తమన్న లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మత్తెక్కించే అందాలతో నెటిజన్ల గుండెలను క్లీన్‌బౌల్డ్ చేస్తోంది ఈ బ్యూటీ.

ఓవైపు సినిమాలు.. మరోవైపు స్పెషల్ సాంగ్స్..ఇంకోవైపు వెబ్ సిరీస్ లంటూ దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకుంటోంది తమన్నా. కుర్ర హీరోల పక్కన అవకాశాలు తగ్గడంతో చేసేదేమి లేక సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ.

గత 18 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది ఈ మిల్కీ బ్యూటీ. కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ తన కెరీర్ లో దాదాపు అందరితో యాక్ట్ చేసింది.

మొదట సౌత్ లో తన సత్తా చూపించిన తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లో దుమ్ముదులుపుతోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‏లలో నటిస్తూ తన బోల్డ్ నటనతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. సినిమాల కన్నా ఎక్కువగా సిరీస్‎లకే ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలుస్తోంది.

తమన్నా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. టాలీవుడ్, బాలీవుడ్‎లో అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతూ వస్తున్నాయి. అయినప్పటికీ పారితోషకం విషయంలో తమన్నా ఎక్కడా తగ్గడం లేదు.

ఇక స్పెషల్ సాంగ్స్‏కైతే ఓ రేంజ్‎లో డిమాండ్ చేస్తోందట. తను అనుకున్న పేమెంట్ ఇస్తేనే సై అంటుందట. వెబ్ సిరీస్ ఆఫర్స్ వస్తే కోటి నుంచి రెండు కోట్ల వరకూ రెమ్యునరేషన్ అడుగుతోందట. కోటికి తక్కువ అంటే ఏమాత్రం ఒప్పుకోవడం లేదరి టాక్ వినిపిస్తోంది.

ఈ మధ్యనే టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి మూవీ భోళా శంకర్ సినిమా చేసింది. ఈ సినిమాలో తమన్నాకు పెద్దగా ప్రయారిటీ లేదనిపించింది. ప్రస్తుతమైతే అమ్మడికి తెలుగులో పెద్దగా సినిమాలు లేవనే చెప్పాలి.

ఏవైనా సీనియర్ హీరోల సినిమాలు ఉంటే ఈ బ్యూటీని ఆప్షనల్ గా తీసుకుంటున్నారట. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లో నటించినా బోల్డ్ క్యారెక్టర్లలో కనిపించడంతో జనాలు ఎగబడి చూశారు తప్ప పెద్దగా నటన పరంగా తమన్నా హిట్ కొట్టలేదనే చెప్పాలి.

ఈ క్రమంలో సాలిడ్ హిట్ లేకపోవడంతో బాలీవుడ్ లో మళ్లీ తన క్రేజ్ పెంచుకునేందుకు ఓ ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందట. ఇప్పటికే తమన్నా చాలా వరకు ఐటెమ్ సాంగ్స్ లో నటించింది.

ఇది ఆమెకు కొత్తేమి కాదు. అయితే కేవలం 3 నిమిషాల పాట కోసం అమ్మడు డిమెండ్ చేసింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా ఈ స్పెషల్ సాంగ్ కోసం రూ.5 కోట్ల పారితోషకాన్ని అడిగిందంటూ న్యూస్ వైరల్ అవుతోంది.

అమ్మడి అందానికి, డ్యాన్స్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా ఒప్పుకున్నారట. ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.

Leave a Comment