Pawan Kalan-OG: ఓజీ నుంచి పవన్ లేటెస్ట్ లుక్ ..ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

website 6tvnews template 2024 03 16T175312.116 Pawan Kalan-OG: ఓజీ నుంచి పవన్ లేటెస్ట్ లుక్ ..ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్న లేటెస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ ఓజీ (OG). సాహో (saho )ఫేమ్ డైరెక్టర్ సుజీత్ (Sujith ) పాన్ ఇండియా లెవెల్ లో ఖతర్నాక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాని (Nani) సినిమా గ్యాంగ్ లీడర్ (Gangleader )తో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan ) పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తోంది. ఈ మూవీ నీ పాన్ ఇండియా లెవెల్ లో తీస్తుండడంతో బాలీవుడ్ స్టార్స్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ (Imran Hashmi ), సీనియర్ నటి శ్రియా రెడ్డి (Shriya reddy )అర్జున్ దాస్ (arjun das ) తదితరులు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించునున్నారు. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. మరి ముఖ్యంగా పవన్ లుక్స్ గురించి ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ కూడా ఈ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కత్తిలా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

పవర్ స్టార్ కత్తిలా ఉన్నాడు :

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )ఎప్పుడు తన సినిమాలో సింపుల్ లుక్ తో కనబడి అదరగొడుతూ ఉంటాడు. మరి ముఖ్యంగా పోలీస్ గెటప్ లో ఆయన చేసే యాక్టింగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే చాలా సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్ చేశాడు పవన్. ఇక ఓజి(OG) మూవీలో పవన్ లుక్ ఎలా ఉంటుందని అందరు ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఓజీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman )పవన్ కల్యాణ్‌ నయా పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్ లో కత్తి పట్టుకుని బట్టల నిండా రక్తంతో పవన్ యాంగర్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. సినిమా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

గ్యాంగస్టర్స్ కథాతో వస్తున్న పవన్ :

జపాన్(Japan ), ముంబై (Mumbai ) నగరాల్లో ని గ్యాంగస్టర్స్ స్టోరీ తో ఎంతో స్టైలిష్ గా ఈ సినిమాను తీస్తున్నాడు డైరెక్టర్ సుజిత్ . ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం పవన్ ఎలక్షన్ పనుల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా కు కాస్త బ్రేక్ పడింది. ఎన్నికలు పూర్తి కాగానే మళ్ళీ సినిమాను పట్టాలు ఎక్కించునున్నారు.

Leave a Comment