Breaking News

KTR : ఓల్డ్ సిటీలో మంత్రి కేటీఆర్ హల్చల్..సడన్ గా హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్.

Minister KTR Halchal in Old City.. KTR suddenly entered the hotel.

KTR : ఓల్డ్ సిటీలో మంత్రి కేటీఆర్ హల్చల్..సడన్ గా హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్.

ప్రస్తుతం నడుస్తోంది శీతాకాలమే అయినా తెలంగాణ రాష్ట్రంలో ఎలెక్షన్ పాలిటిక్స్ మాత్రం సమ్మర్ హీట్ ను తలపిస్తున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.

వీటితో పాటు ఆయా పార్టీల నేతలు నియోజకవర్గాల్లో ప్రణాలికను రూపొందించుకుని మరీ సుడిగాలి పర్యటలు చేస్తున్నారు. సభలు సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం హామీలను గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు కూడా చెరుగుతూనే ఉన్నారు.

అధికార బి.ఆర్.ఎస్ నుండి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ చుస్తే రాహుల్ గాంధీ తో సమావేశాలు.

నిర్వహిస్తోంది, పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుని తిరుగుతున్నారు. ఇక బీజేపీ కోసం కేంద్రం నుండి కమలనాధులు ప్రచారం కోసం వస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి, బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ విజయం కోసం నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. సభలు సమావేశాలు, కార్నర్ మీటింగ్స్ పేరుతొ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇక కేటీఆర్ ఆకస్మికంగా వెళ్లి ప్రజలతో మమేకం అవడం కూడా మనం చూడొచ్చు.

ఈ చిత్రమైన ఘటన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చోటుచేసుకుంది. హోటల్ లో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న కాస్టమర్స్ వద్దకు వెళ్లిన కేటీఆర్ వారికి సడన్ సర్ప్రైస్ ఇచ్చారు.

షాదాబ్ రెస్టారెంట్‌కు వెళ్లిన కేటీఆర్ అక్కడి ప్రజలతో కలిసిపోయారు. వారికి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పధకాల గురించి వివరించారు.

ముఖ్యంగా ఆడవారితో, చిన్న పిల్లలతో కూడా కేటీఆర్ చాలా చక్కగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే స్థానికులు సైతం మంత్రిని చూడగానే అవాక్కయ్యారు. మంత్రితో కరచాలనం చేస్తూ సెల్ఫీలు, ఫోటోలు దిగారు. మంత్రి కూడా ఓపికగానే సెల్ఫీ;లకు ఫోజులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *