Ministers who lost along with KCR: కెసిఆర్ తోపాటు ఓడిపోయిన మంత్రులు వీళ్ళే

Add a heading 11 1 Ministers who lost along with KCR: కెసిఆర్ తోపాటు ఓడిపోయిన మంత్రులు వీళ్ళే

ప్రస్తుతం వెలువడుతున్నది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే అయినప్పటికీ ఇవి సర్వత్రా ఆశక్తి రేపుతున్నాయి. జాతీయ స్థాయిలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు కేసీఆర్.

ఇక మీదట ఆయన రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతానని అందుకే తమ పార్టీ పేరును జాతీయ స్థాయిలో ఉండేలా మార్చమని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా హస్తినలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.

అనంతరం జాతీయ స్థాయిలో పర్యటలు చేసి వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రులను కలిసి వారిని కూడగట్టేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశారు.

ఈ తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే జాతీయ రాజాకీలకు సంబంధించి తన ప్రణాళిక కూడా పూర్తి స్థాయిలో రూపొందిస్తామని ఖచ్చితంగా బీజేపీ ని గద్దె దించుతామని అన్నారు. కానీ అనుకోని విశదంగా బిఆర్.ఎస్ పార్టీ పరాజయం పాలయింది.

Add a heading 10 1 Ministers who lost along with KCR: కెసిఆర్ తోపాటు ఓడిపోయిన మంత్రులు వీళ్ళే

కేసీఆర్ రెండు స్థానాల నుండి పోటీ చేయగా అయన గజ్వేల్ లో గెలిచి పరువు నిలుపోగలిగారు. రెండో స్థానమైన కామారెడ్డి లో ఓడిపోవడం కేసీఆర్ కి తీరని అవమానాన్నే మిగిల్చింది. టిఆర్.ఎస్ లో కేవలం కేసీఆర్ మాత్రమే కాదు, ఆయన కేబినెట్ లోని కొప్పుల ఈశ్వర్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. ఇది బి.ఆర్.ఎస్ కి తీరని అవమానంగానే చెప్పొచ్చు.

తెలంగాణతో పాటు మహారాష్ట్ర లో రాజకీయంగా బలపడేందుకు రెండు మూడు మార్లు భారీ స్థాయిలో ర్యాలీలు చేపట్టి తమ బలం నిరూపించుకునేందుకు గులాబీ బాస్ ప్రయత్నించారు. కానీ తీరా తెలంగాణ లోనే ఓడిపోవడంతో మొదటి మెట్టుమీదే బోర్ల పడ్డట్టయింది. రచ్చ గెలవడానికి ముందు ఇంట గెలిచి ఉంటె బాగుండేది అనే మాటలకు కేసీఆర్ తావిచ్చినట్టయింది.

Leave a Comment