Minor Accident KTR fell from the campaign van : ప్రచార రథంపై నుంచి కిందపడ్డారు.ప్రమాదం స్వల్పగాయాలతో బయటపడింది.
తెలంగాణ మంత్రి బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఒక చిన్న ప్రమాదానికి గురయ్యారు. నేడు ఆయన ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా ఈ ప్రమాదం సంభవించింది.
ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలుకు వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రచార వాహనంపై మంత్రి కేటీఆర్, జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డిలతోపాటు ఇతర నేతలు ఉన్నారు. ర్యాలీ వాహనం వేగంగా వెళుతోంది. అయితే వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వాహనం పైన ఉన్నవారంతా ఒక్కసారిగా ముందుకి పడిపోయారు. దీంతో వాహనం పైన ఉన్న కేటీఆర్ తో పాటు మిగిలిన నేతలందరికీ స్వల్ప గాయాలయ్యాయి.
మంత్రి కేటీఆర్ స్వల్ప గాయాలతో బయటపడగా జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి మాత్రం తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో కేటీఆర్ ముందు వరుసలో నిలబడి ఉన్నారు.
దీంతో ఆయనకు ప్రచార వాహనం టాప్ కి అమర్చిన రాడ్ పొట్ట భాగంలో బలంగా నొక్కుకున్నట్టు వీడియో చుస్తే అర్ధమవుతోంది. ఇక ఎంపీ సురేష్ రెడ్డి అయితే వాహనం కుదుపుకి ఒక్క ఉదుటున కింద పడిపోయారు. నేతలంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం అందుతోంది.