Miss Perfect Trailer: మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి ‘మిస్ పర్ఫెక్ట్’ ట్రైలర్ విడుదల

website 6tvnews template 79 Miss Perfect Trailer: మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి ‘మిస్ పర్ఫెక్ట్’ ట్రైలర్ విడుదల

పెళ్లైన మూడు నెలలకే మెగావారి కొత్త కోడలు లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi) తన కెరీర్ పై మళ్లీ ఫోకస్ పెట్టింది. గత ఏడాది నవంబర్ లో ఇటలీలో మెగా ప్రిన్స్ ( వరుణ్ తేజ్ Varun Tej)ని లావణ్య త్రిపాఠి పెళ్లాడిన విషయం తెలిసిందే.

ఈ మధ్యేనే విదేశాలకు వెళ్లొచ్చింది ఈ కొత్త జంట. అయితే పెళ్లి జరిగే టైంకే వరుణ్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వరుణ్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.

ఈ క్రమంలో లావణ్య కూడా తన కెరీర్ పై దృష్టి పెట్టింది. అయితే ఈ సారి సినిమా కాకుండా లావణ్య ‘మిస్ పర్ఫెక్ట్ ‘ Miss Perfect అనే వెబ్ సిరీస్ లో నటించింది. త్వరలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‎ఫామ్‎లో ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది.

‘పులి మేక’ వెబ్ సిరీస్‌ తర్వాత లావణ్య నటిస్తున్న సెకెండ్ వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్‌’ . ఇప్పటికే రిలీజైన టీజర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా ట్రైలర్ కూడా లాంచ్ అయ్యింది. ఈ ట్రైలర్ తో స్టోరీపై ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. ఈ సిరీస్ లో లావణ్యకు జోడీగా బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్ కనిపించనున్నాడు.

Miss Perfect – Trailer | Lavanya Tripathi | Abijeet | Abhignya | DisneyPlus Hotstar Telugu:

How is the Miss Perfect Trailer : ‘మిస్ పర్ఫెక్ట్’ ట్రైలర్ ఎలా ఉందంటే

ట్రైలర్ విషయానికొస్తే..ఈ వెబ్ సిరీస్‌లో లావణ్యకు ఓసీడీ ఉంటుంది. అందుకే ఆమెకు శుభ్రత అంటే ఎంత ప్రాణమో టీజర్ లోనే చెప్పేశాడు డైరెక్టర్. అదే విషయాన్ని ట్రైలర్ ప్రారంభంలోనూ చూపించాడు.

ప్రతీ విషయంలోనూ పర్ఫెక్ట్ అండాలని అనుకునే అమ్మాయి లావణ్య. ఇక ఈ వెబ్ సిరీస్ లో లావణ్యకు జోడీగా నటిస్తున్న బిగ్ బాస్ (Bigg Boss) ఫేమ్ అభిజిత్ (Abhijith) కు వండటం అంటే చాలా ఇష్టం.

ఆ వంట చేయడం కోసం ఫ్లాట్ మొత్తం అపరిశుభ్రంగా మార్చేస్తుంటాడు. అపోజిట్ వర్షన్ లో ఉన్న వీరిద్దరు ఒకే ఫ్లాట్ లో ఉంటే ఎదురయ్యే సమస్యలేంటో ట్రైలర్ లో చాలా క్లారిటీతో చూపించాడు డైరెక్టర్.

ఆ తర్వాత వారిద్దరి లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ‘మిస్ పర్ఫెక్ట్’( Miss Perfect) రిలీజైన తర్వాతే చూడాలి. ఇకపోతే ఈ సిరీస్‌లో లావణ్య క్యారెక్టర్ పేరు కూడా లావణ్యనే. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సిరీస్ పై ఇంట్రెస్ట్ ను పెంచింది.

On screen for the first time after marriage : పెళ్లి తర్వాత మొదటిసారిగా స్క్రీన్ మీద

miss perfect trailer Miss Perfect Trailer: మెగా కొత్త కోడలు లావణ్య త్రిపాఠి ‘మిస్ పర్ఫెక్ట్’ ట్రైలర్ విడుదల


అన్నపూర్ణ స్టూడియోస్ (Annapoorna Studios)నిర్మాణంలో ‘మిస్ పర్ఫెక్ట్’ ( Miss Perfectవెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది.

స్కౌలాబ్ మూవీ ఫేమ్ డైరెక్టర్ విశ్వక్ ఖండేరావు (Vishwak Khanderao) ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ లో లావణ్య త్రిపాఠి, అభిజీత్ తో పాటు అభిజ్ఞ (Abhigna), హర్ష వర్ధన్ (Harsha Vardhan), మహేశ్ విట్టా (Mahesh Vitta), సునైనా (Sunaina) లాంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక చాలా కాలం తర్వాత స్క్రీన్ పై లావణ్య కనిపిస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం లావణ్య చేతిలో సినిమాలు ఏమీ లేవు. ‘తనాల్’ అనే ఒక తమిళ చిత్రం మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

Varun family did not put any conditions : వరుణ్ ఫ్యామిలీ ఎలాంటి షరతులు పెట్టలేదు.

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది లావణ్య ( Lavanya Tripathi) . ఆ తర్వాత టీవీలోనూ చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించింది. టాలీవుడ్ లో అందాల రాక్షసి (Andala Rakshasi)సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.

మెగా హీరో, భర్త వరుణ్ తేజ్‌ (Varun Tej)తో కలిసి మిస్టర్ (Mister), అంతరిక్షం (Antariksham)వంటి సినిమాలు చేసింది లావణ్య. అదే టైంలో వరుణ్ తో ప్రేమలో పడింది. మొత్తానికి గత ఏడాది నవంబర్ లో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత లావణ్య నటిస్తున్న ఫస్ట్ సిరీస్ ఇది.

దీంతో మెగా అభిమానులు మిస్ పర్ఫెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరీ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది. ఇక పెళ్లి త‌ర్వాత తన కెరీర్ పై సినిమాలు, క్యారెక్టర్ల ఎంపిక‌లో వ‌రుణ్ కుటుంబ సభ్యలు త‌న‌కు ఎలాంటి కండీష‌న్స్ పెట్ట‌లేద‌ని లావణ్య ఓ ఇంటర్వ్యేలో తెలిపింది.

కెరీర్ ప‌రంగా వరుణ్ ఫ్యామిలీ నాకు ఫుల్ స‌పోర్ట్‌ ఇస్తోందని,. ఏ సినిమాలు చేయాలి, చేయకూడదు అనే విషయంలో నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయని లావణ్య చెప్పింది. వాటినే పెళ్లి త‌ర్వాత కూడా వాటిని అనుసరిస్తాను అని లావ‌ణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చింది.

Leave a Comment