MLA – IAS wedding: ఓ ఎమ్మెల్యే – ఐఏఎస్ ల పెళ్లి… మూడు రాష్ట్రాల నుంచి హాజరవుతున్న అతిథులు
ఐఏఎస్ కి ఎమ్మెల్యే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే,హరియాణాలోని మాజీ ముఖ్యమంత్రి అయిన భజన్ లాల్ మనవడు అయినా భవ్య బిష్ణో, ప్రస్తుతం ఎమ్మెల్యేగా పని చేస్తున్నాడు.
ఇతను ఒక సివిల్ సెర్వెన్ట్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ పెళ్లి కుమార్తె ఒక ఐఏఎస్ అధికారిణి అవడం విశేషం.ఈ డిసెంబర్ 22వ తారీఖున ఈ వివాహం జరగబోతుంది.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈ వివాహం జరగనుంది.ఇక ఈ వేడుక గురించి రెండు రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానించారు. పుష్కర్, అదంపూర్ ఢిల్లీ మూడు ముఖ్య నగరాలు వీరి రిసెప్షన్ కి వేదికగా మారనున్నాయి.
ఈ వివాహానికి 3 లక్షలకి పైగా అతిథులకు ఆహ్వానం అందింది. దానితో ఈ వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.భవ్య బిష్ణోయ్ కు మరియు ఐఏఎస్ పరి బిష్ణోయ్ లకి ఏప్రిల్ 2023లో ఈ ఎంగేజ్మెంట్ అయ్యింది.
అదంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు.మాజీ ముఖ్యమంత్రి అయిన భజన్ లాల్ మనవడైన ఈ భవ్య బిష్ణోయ్, కులదీప్ బిష్ణోయ్ కి కుమారుడు.
ఈ కులదీప్ భాజపా ప్రముఖ నేత, అతను మాజీ ఎంపీ.ఇక వధువు 2019లో సివిల్స్ సాధించింది. సిక్కిం క్యాడర్, గ్యాంగ్ టాక్ లో ఇపుడు పని చేస్తుంది.
ఇక వివాహం యువతి రాష్ట్రమైన ఉదయ్ పుర్ లోనే జరుగుతుంది.భవ్య బిష్ణోయ్ తండ్రి అయినా కులదీప్ బిష్ణోయ్ ఆ నియోజకవర్గంలోని 80 కి పైగా గ్రామాలను వివాహానికి ఆహ్వానిస్తామని తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
అయన తండ్రి కూడా ఆయన వివాహానికి ఊరూరా తిరిగి ఆహ్వానించాడని, ఆ సమయంలో అయన ముఖ్యమంత్రిగా ఉన్నారని,
ఇపుడు తన కొడుకు పెళ్ళికి తను కూడా అలాగే చేసే ఆలోచన ఉందని తెలిపారు.
ఈ వివాహం తరువాత ఢిల్లీ లో జరిగే రిసెప్షన్ కి మూడు రాష్ట్రాల నుంచి ప్రముఖలు, రాజకీయ నాయకులు రానున్నారని తెలిపాడు.
అయితే ఇంతకుముందు ఈ భవ్య బిష్ణోయ్ కి సినీనటి మెహ్రిన్ కి నిశ్చితార్థం జరిగింది, కానీ కొన్ని కారణాల వల్ల అది రద్దయింది.