MLC’s Construction of Ram temple: రామమందిర నిర్మాణం పై ఎమ్మెల్సీ కవిత మనసులో మాట.
అయోధ్య లో నిర్మితమవుతున్న రామ మందిరం గురించి తెలంగాణ లోని బిఆర్.ఎస్ పార్టీ ముఖ్య నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.
రామ మందిర నిర్మాణం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయోధ్య లోని రామ మందిరంలో సీతారామచంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట గురించి దేశం లోని హిందువులంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు.
రామమందిరంలో విగ్రహ ప్రతిష్ట వార్త విని హిందూ ప్రజలంతా మిక్కిలి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. జనవరి 22వ తేదీన ఆలయం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల కోట్లాది హిందువుల కల నెరవేరబోతోందని అన్నారు.
శుభ పరిణామం..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 10, 2023
అయోధ్యలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ప్రతిష్ట,
కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో…
తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు..
జై సీతారామ్ pic.twitter.com/qzH7M32cQJ
దేశ వ్యాప్తంగా ఎంతో మంది హిందువులు రామ మందిర నిర్మాణం కోసం భక్తి తో ఎదురు చూస్తున్నారు. రామ మందిర నిర్మాణం వెనుక ఆధ్యాత్మికత ఉందని చెప్పొచ్చు.
అంతటి ఆధ్యాత్మికత దాగి ఉన్న రామమందిర ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఆలయ గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు జనవరి 22వ తేదీని నిర్ణయించారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు ఈ వేడుకకు అన్ని వర్గాలకు సంబంధించిన 4 వేల మంది సాధువులకు ఆహ్వానాలు పంపించనున్నారు.
జనవరి 16వ తేదీ నుండే ఈ వేడుకకు సంబంధించిన వైదిక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. భక్తులు ఈ వేడుక తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని భావించిన నిర్వాహకులు భక్తుల సౌకర్యార్ధం అన్ని రకాల వసతి ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టనున్నారు.