రష్యా(Russia) రాజధాని మాస్కో(Moscow)లో ఉగ్రమూకలు నరమేధాన్ని(Terror Attack) సృష్టించాయి. మర్చి 22 వతేదీ రాత్రి క్రాకస్ సిటీ లోని కన్సర్ట్ హాల్ ఒక్కసారిగా రక్తసిక్తమైంది. యమురాళ్ళకన్నా భయంకరంగా ఉండే ఈ ఉగ్రవాదులు భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. మారణాయుధాలతో హాలులోకి ప్రవేశించిన ఆటంకవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపి అమాయకప్రజల ప్రాణాలు తీశారు. ఈ దాడిలో 60 మందికి పైగా చనిపోగా, సుమారు 140 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అత్యంత సంచలనంగా మారింది. ఒకే ఘటనలో 60 మందికి పైగా చనిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రపంచం మొత్తం రష్యా వైపే తిరిగి చూసింది.
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ అమానవీయ ఘటన ను ఆక్షేపిస్తున్నారు. ఇక ఈ దారుణ మారణహోమం పై భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) కూడా స్పందించారు. ‘ఎక్స్’ వేదికగా తన మనసులోని భావాన్ని ప్రకటించారు. ముందుగా మోదీ ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు, గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక రష్యా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సంఘీభావాన్ని తెలియజేశారు.
ఇంకా మోదీ ఏమన్నారంటే “మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. తమ ఆలోచనలు, ప్రార్థనలు బాధితుల కుటుంబాలతోనే ఉంటాయని చెప్పారు. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి, రష్యన్ ఫెడరేషన్ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ మోదీ ట్వీట్(Modi Tweet) చేశారు. ఇది ఇలా ఉంటె ఈ దారుణానికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(Islamic State Group) ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.