మీరు ఎప్పటికి మా స్నేహితులే – కలిసి నడుద్దాం – పుతిన్ ని అభినందించిన మోడీ !

website 6tvnews template 2024 03 20T170724.439 మీరు ఎప్పటికి మా స్నేహితులే - కలిసి నడుద్దాం - పుతిన్ ని అభినందించిన మోడీ !

Modi congratulated putin on a re-electing as a president of Russia : ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికలలో పుతిన్ మరోసారి అధ్యక్షడుగా ఎన్నికైనందుకు పుతిన్ ని అభినందించారు మోడీ. బెస్ట్ విషెస్ అంటూ ‘ X ‘ లో పోస్ట్ పెట్టారు.

రాబోయే రోజుల్లో మన రెండు దేశాల మద్య ఉండే వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం అవ్వడానికి మీతో కలిసి నడవాలి అనుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేసారు. మన పొరుగు దేశం అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కుడా అబినందనలు చెప్పిన వాళ్ళలో ఉన్నారు.

దాదాపు 3 రోజుల పాటు జరిగిన అధ్యక్ష ఎన్నికలలో పుతిన్ భారీ విజయం సాధించారు. సుమారు గా 87% ఓట్లతో గెలుపొందినట్లుగా రష్యన్ అధికారులు ప్రకటించారు. మరో సారి అధికారం దక్కడం తో ఈ సారి 6 సంవత్సరాల పటు ఆయనే రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు.

దాదాపు 24 సంవత్సరాలు గా ఆయనే అధికారం లో ఉన్న నేతగా అంటే ప్రధాని గా, అధ్యక్షడు గా కలిపి ఎక్కువ కాలం ఉన్న నాయకుడిగా రికార్డు తిరగరాయనున్నారు. ఆయనకు బలమైన అభ్యర్ధులు కాని విమర్శించేవారు కాని లేకపోయినా చాలా కట్టుదిట్టమైన వాతావరణం లో ఎలక్షన్స్ జరిగాయని అధికారులు చెప్పారు.

Leave a Comment