PM Modi Tweet on KCR health: కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ స్పందన.. కుమార్తె కవిత ఏమన్నారంటే.

Prime Minister Modi's response to KCR's health.

PM Modi Tweet on KCR health : కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ స్పందన.. కుమార్తె కవిత ఏమన్నారంటే.

తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అర్ధరాత్రి సమయంలో పట్టి తప్పి బాత్ రూమ్ లో పడిపోయారు. దీంతో ఆయన తుంటికి గాయమైంది.

వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సామాజిగుడా లోని యశోదా ఆసుపత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఆయన కాలికి శస్త్ర చికిత్స చేసి ప్లేట్లు అమర్చనున్నారు.

ఆయన తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు తెలుస్తోంది. ఇక అయనకు తుంటి గాయం మినహా అయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక ఆయన ఈ గాయం నుండి కోలుకోవడానికి నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా ఆసుపత్రిలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక కేసీఆర్ ఆరోగ్యంపై ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్ కి స్వల్ప గాయమైందని చెప్పారు. కేసీఆర్ కి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని అన్నారు.

కేసీఆర్ కి ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉందని, ఆయనకు ఏమి కాదని చెప్పారు. అభిమానుల ఆకాంక్షల మేరకు ఆయన త్వరగానే కోలుకుని తిరిగి వస్తారని పేర్కొన్నారు. అయన పట్ల చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు కల్వకుంట్ల కవిత.

ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్న కేసీఆర్ ప్రమాదవశాత్తు బాత్ రూమ్ లో పడిపోవడం వల్ల గాయాలపాలయ్యారని తెలుసుకున్న ప్రధాని మోదీ స్పందించారు.

ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ కి జరిగిన సంఘటన తనను బాధించిందన్నారు. ఆయన మునుపటి మాదిరిగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్టు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Leave a Comment