President of Russia Putin: లోక్‌సభ ఎన్నికలలో మోదీకే విజయం దక్కాలి.
ఎన్నో ఏళ్ళు గా భారత – రష్యా మధ్య అంతర్జాతీయ పరంగా ఎన్ని అవాంతరాలున్నా, మంచి సంబంధాలే కొనసాగుతాయని చెప్పటానికి రష్యా అధ్యక్షుడు అన్న ఈ మాటే నిదర్శనం అని చెప్పవచ్చు.
అలాగే, ప్రధాని మోదీతో భేటీ కోసం తాను ఎదురుచూస్తున్నానని, రష్యా లో పర్యటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నా స్నేహితుడైన మోదీని కలుసుకోవడం తనకు ఎంతో ఆనందమని తెలిపారు.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తన స్నేహితుడికే విజయం దక్కాలని ఆకాంక్షింస్తున్నానని తెలిపారు. భౌగోళిక రాజకీయ పరిస్థితుల సంగతి ఎలా ఉన్నా..
మాస్కో-దిల్లీ మధ్య సంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని పుతిన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ తో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ వ్యాఖ్యలను తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత్‌లో రాజకీయంగా బిజీ వాతావరణం నెలకొంది. నేను నా స్నేహితుడి విజయాన్ని ఆకాంక్షిస్తున్నాను. ఆయన రష్యాలో పర్యటించాలని కోరుకుంటున్నా.
నా ఆహ్వానాన్ని ఆయనకు అందించండి’ అని జై శంకర్‌కు పుతిన్ వెల్లడించారు. ఆయన రష్యా వస్తే.. వర్తమాన అంశాలు, రెండు దేశాల సంబంధాల బలోపేతం గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఉక్రెయిన్ పరిణామాలపై తాను మోదీతో మాట్లాడానని పుతిన్ చెప్పారు.
ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం దిశగా భారత ప్రధాని తన వంతు ప్రయత్నాలు చేస్తారని అందుకే, ఈ విషయం పైన తనతో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. పుతిన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో భేటీ అయిన ఫొటోలను జై శంకర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఐదురోజుల పర్యటనలో భాగంగా అయన రష్యా వెళ్లారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై రెండు సంవత్సరాలు అవుతున్నా..
యుద్ధాల కోసం సమయం కేటాయించే యుగం కాదని, రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ కోరుకుంటోంది.
ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేస్తూనే ఉంది. ఐరాసలో ఉక్రెయిన్ అనుకూల తీర్మానాల విషయంలో కూడా పశ్చిమ దేశాల ఒత్తిడి తట్టుకొని స్వతంత్ర వైఖరిని భారత్ పాటిస్తుందని తెలిపారు