Modi Tweet on Telangana CM: రేవంత్ రెడ్డికి ప్రధాని భరోసా!

Add a heading 27 Modi Tweet on Telangana CM: రేవంత్ రెడ్డికి ప్రధాని భరోసా!

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ గెలుపొందిందన్న విషయం తెలిసిందే.
ఈ విజయం మాములు విజయం కాదు . తెలంగాణలోని ఎన్నికల్లో 119 స్థానాలకుగాను 64 స్థానాలు గెలుచుకుంది కాంగ్రేస్ .

ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమైన ఘట్టం మంత్రి వర్గం యొక్క ఏర్పాటు.
ఇక ఆ ప్రక్రియలోనే ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. గెలుపొందిన పార్టీ ముఖ్యులందరు కలిసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిర్ణయించారు. తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధపడ్డాడు.

గురువారం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకరం చేసారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అక్కడ పార్టీ పెద్దలైన సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తదితరులను కలిసి వారిని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించి తిరిగి హైదరాబాద్ కి వచ్చాక ప్రమాణస్వీకారం చేసాడు.
ఈ ప్రమాణస్వీకారానికి కాంగ్రేస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, దీపేందర్ తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు.

లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరిగింది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రముఖులు కొత్త సీఎంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అలా దేశపు ముఖ్య వ్యక్తి అయిన ప్రధాని మోదీ కూడా కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి శుభాకాంక్షలు తెలియజేసారు.

శుభాకాంక్షలు తెలుపుతూనే మోడీ తన మద్దతు ఎప్పుడు ఉంటుందన్న హామీ రేవంత్ కి ఇచ్చాడు.
ఇక రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణ రావు, గడ్డం ప్రసాద్ కుమార్ లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసారు.

Leave a Comment