ఆంధ్ర బహిరంగ సభలో జగన్ సర్కార్ మీద మోడీ సంచలన వ్యాఖ్యలు

HMSQs0zt ఆంధ్ర బహిరంగ సభలో జగన్ సర్కార్ మీద మోడీ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర రాష్ట్రానికి ప్రచారం కోసం వచ్చిన మోదీ తొలుత తెలుగులో ‘నా ఆంధ్ర కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ ప్రసంగం ప్రారంభించడం సభకి వచ్చిన ప్రజలు ఒకింత ఆనందం కల్గింది అని అక్కడ ప్రజలు అనుకోవడమ కనిపించింది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లో అవినీతి రాజ్యమేలుతోంది అని అలాంటి సర్కార్ మనకి అవసరమా, ఇప్పుడు కేంద్రం లో NDA సర్కార్ రావడానికి అలాగే ఇక్కడ ఆంద్ర రాష్ట్రం లో మెరుగైన ప్రభుత్వం తీసుకు రావడానికి సంకల్పించి నట్లు తెలుస్తోంది అని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగు ప్రజలు తీవ్ర ఆగ్రహం తో ఉన్నట్లు మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది అని అక్కడి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసారు.

అంతే కాదని పాలనను పట్టించుకోకుండా నువ్వా నేనా అంటూ అవినీతిని ప్రోత్సహించడంలో పోటీ పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ 5 సంవత్సరాలలో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి సాదించలేదని మేము ఈ రాష్ట్రనికి ఎన్నో రకాలు కేంద్ర విద్యా సంస్దలు ఇచ్చామని అంతే కాకుండా ఇక్కడ అభివృద్ధి చెయ్యడానికి అవసరమైన నిధులు కుడా ఇచ్చామని కాని ఒక్క ప్రాజెక్ట్ కుడా పూర్తి చెయ్యలేదని ఆయన విమర్శించారు. ఇక్కడ మిమ్మల్నిచూస్తే కేంద్రం లో అలాగే రాష్ట్రం లో NDA కూటమి గెలిపించాదానికి ఆంద్ర ప్రజలు సర్వ సిద్దం గా ఉన్నట్లు తెలుస్తోంది ఆయన అన్నారు.ఎలక్షన్ షెడ్యుల్ రాగానే ప్రాచారం కోసం తాను మొదట ఆంధ్ర ప్రదేశ్ కి రావడం చాల ఆనందం గా ఉందని ఆయన అన్నారు.

‘వైకాపా, కాంగ్రెస్‌ పార్టీలు వేర్వేరు కాదు, రెండూ ఒకటే. ఒకే కుటుంబం నుంచి వచ్చినవారు నాయకత్వం వహిస్తున్నారు’ అని అభివర్ణించారు.YCP, కాంగ్రెస్ లు వేరు వేరు కాదని రెండు ఒకటే అని ఒకే కుటుంబ నుండి వచ్చి వాళ్ళు రెండు పార్టీ లకు న్యాయకత్వం వహించడం అనేది మీరు చూడవచ్చు అంటూ చురకలు అంటించారు.ఆంద్ర లో ఉన్న మీరు అందరు బాగా ఆలోచించి మీ ఓటు అభివృద్ధి కి వెయ్యాలని కాని అరాచకానికి కాదు అని మోడీ చెప్పడం చూస్తే ఆయన దారి ఏటో అర్ధం అవుతోందని పలువు నిపుణులు అంటున్నారు. ప్రాజాస్వామ్యం లో వెలుగులు నింపేందుకు సంఘీభావం గా మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ లో ప్లాష్ లైట్ వేసి సపోర్ట్ చెయ్యమని చెప్పడం ఈ ఆలోచన బావుందని అక్కడ ఉన్న ప్రజలు అనుకోవడం కనిపించింది.

ఇండియా కూటమి పేరుకే తప్ప ఒకరి పై ఒకరికి అసలు నమ్మకం లేదని ఆయన విమర్శించారు.మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుండి నలుగు తున్న అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ రోజున దానిని ప్రతి ఇంటా ఒక ఉత్సవం జరిగేల నిర్వహించామని ఆయన చెప్పారు.ఈ సభ లో ఆయన NTR ని స్మరించుకోవడం ఒక విశేషం అనే చెప్పాలి ఆయన NTR గురించి మాట్లాడుతూ రాముడు, కృష్ణుడి పాత్రలను తలచుకుంటే ఎన్టీఆర్‌ గుర్తొస్తారని, ఆ పాత్రల్లో ఆయన నటించడం కాదని జీవించారని అని చెప్పాలని ఆయన ప్రశంసించారు. అంతే కాదు అయన కు గౌరవసూచకంగా మా ప్రభుత్వం NTR శతజయంతి సందర్భంగా కేంద్రం ఒక ప్రత్యేక వెండినాణాన్ని కుడా విడుదల చేసామని ప్రధాని మోదీ వివరించారు.

NDA ప్రభుత్వం దేశం లో ఉన్న అన్ని పార్టీ లకు అతీతం గా దేశ అభివృద్ధి తో పాటు దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు దేశానికి చేసిన సేవలకు గుర్తు గా PV నరసింహారావు గారికి భారత రత్న ఇచ్చి ఆయనను గౌరవిమ్చామని ఆయన అన్నారు. కాని కాంగ్రెస్ పారి ఆయన్ను విస్మరించడం అలాగే ఘోరంగా అవమానిచడం చేసారని ఆయన కాంగ్రెస్ నాయకులను దుయ్యబట్టారు .

Leave a Comment