మోడీ “వికసిత్ భారత్ 2047” ప్లాన్ – ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో అమలు

narendra modi at bharat mobility global expo 2024 cover3 1706885052 మోడీ "వికసిత్ భారత్ 2047" ప్లాన్ - ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో అమలు

Modi’s “Vikasit Bharat 2047” plan – implementation within 100 days of government formation : ఈ ఏడాది లో జరగబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం లో కేంద్ర మంత్రులు అందరితో ఆదివారం కీలక సమావేశం జరిగింది.

దీనికి మంత్రుల తో పాటు వివిధ శాఖ ల అధికారులతో పాటు ఆయా రంగాల వ్యాపారవేత్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశం లో వికసిత్ భారత్ 2047 లో భాగం గా పలు అంశాల మీద విస్తృతం గా చర్చించారు.

2024 మే లో ఏర్పడే కొత్త ప్రభుత్వం చేపట్టాల్సిన అలాగే అనుసరించాల్సిన పలు రకాల ప్రణాళికలను కొత్త ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో ప్రారంభించాలి అని ఈ సమావేశం లో నిర్ణయించారు. దీనికే వికసిత్ భారత్ 2047 అని నామకరణం చేసారు.

ఈ వికసిత్ భారత్ 2047 క్రింద భారత దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెయ్యాలని ఆ దిశ గా అందరు కష్ట పడాలి అని దేశం నెంబర్ 1 గా నిలబెట్టాలనేది మోడీ ఆలోచన. 2047 అంటే ఈ సంవత్సరం నాటికి భారత దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తి అవుతుందని ఆయన అన్నారు.

Leave a Comment