Monkey fever 2 dead in karnataka : ఇప్పటికే ఈ మంకీ ఫీవర్‌తో కర్ణాటకలో ఇద్దరి మృతి చెందారు శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఒక వృద్ధుడు (79) చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో మూడు కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణ్‌దీప్ ఆదివారం వెల్లడించారు. శివమొగ్గలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 నమూనాలను సేకరించి పరీక్షించగా అందులో 48 మందికి మంకీ ఫీవర్ ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఈ జ్వరం అనేది కోతులను కరిచే కీటకాలు తిరిగి మళ్లీ మనిషిని కుడితే ఈ వ్యాధి వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు.
ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసీఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.