దేశం లోనే కాకుండా రాష్ట్రం లో మహిళల మీద రోజు రోజు కి ఎక్కడో అక్కడ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టిన జరిగేవి జరుగుతున్నాయి. రోజు రోజుకి భద్రత సన్నగిల్లుతోంది.
ఈరోజుల్లో మహిళలు ఉద్యోగాల నిమిత్తం నైట్ షిఫ్ట్ లలో కూడా జాబ్ లు చెయ్యల్సివస్తోంది. ఆయా కంపెనీలు వాహన సౌకర్యం కలిగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ సౌకర్యాన్ని అందించలేక పోతున్నాయి.
ఇప్పడు అలాంటి వారి కోసం తెలంగాణా ప్రభుత్వం ముఖ్యం గా రాత్రి పూట ఉద్యోగాలు చేసే మహిళల కోసం ఒక సరి కొత్త యాప్ ని అందుబాటు లోకి తీసుకొచ్చింది. అదే T – SAFE యాప్. ఈ యాప్ ద్వారా తెలంగాణా పోలీసులు మహిళల భద్రత గురించి అలాగే ప్రయాణ పర్య వేక్షణ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. ఈ యాప్ అన్ని రకాల మొబైల్స్ లోను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.