Moto G34 5G Launch date: మోటో నుండి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తొందోచ్.


Another budget phone is coming from Moto.

Moto G34 5G Launch date: స్మార్ట్ ఫోన్ల తయారీలో దిగ్గజాలుగా వెలుగుతున్న మోటోరోలా(Motorola) భారత్ లోకి(India) ఒక క్రొత్త స్మార్ట్ఫోన్ ను తీసుకురాబోతోంది. అదే Moto G34 5G.

అయితే ఈ సరికొత్త మోడల్ ను ఎప్పుడు లాంచ్ చేస్తారా అని గాడ్జెట్ లవర్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం ఎంతో దూరంలో లేదు.

కొత్త సంవత్సరం జనవరి 9 వ తేదీనే Moto G34 5G ఫోన్ ను మార్కెట్ లోకి దించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది సారాదు కంపెనీ.

WhatsApp Image 2024 01 06 at 11.30.32 AM Moto G34 5G Launch date: మోటో నుండి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తొందోచ్.

ఈ ఫోన్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ అవుతుందని సమాచారం. ఈ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకునే వారు మోటోరోల అధికారిక వెబ్ సైట్, లేదంటే ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు

భారత్ లో ఇంత ధర ఉండొచ్చు : This price can be in India

మన భారత దేశం లో ఇది జనవరి 9వ తేదీన అందుబాటులోకి వస్తోంది కానీ, ఇప్పటికే ఇది చైనా దేశంలో అందరికి అందుబాటులో ఉంది. ఇది 2023 డిసెంబర్ నెలలో అక్కడ లాంచ్ అయింది.

Motorola Moto G34 Specifications Plus 1.jpg Moto G34 5G Launch date: మోటో నుండి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తొందోచ్.

ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చుస్తే ఇది స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీని కలిగి ఉంది. ఇది పక్కా బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు.

ఇందులో 8జీబీ ర్యామ్ +128జీబీ స్టోరేజ్ ఉంటుంది దీని ధర చైనా(Chaina) లో 999 అంటే మన కరెన్సీలో చుస్తే సుమారుగా 11,600 రూపాయలుగా ఉంటుంది.

రెడ్‌మి(Redmi) 13సి, శాంసంగ్ గెలాక్సీ(Samsung galaxy) ఎం14 లాంటి మొబైల్స్ కి పోటీ గా మారే ఛాన్స్ కూడా ఉందని టెక్ నిపు నూలు అంచనా వేస్తున్నారు. ఇక భారత్ లో దీని ధర ను 15,000 రూపాయలుగా నిర్ణయించవచ్చని అంచనా.

స్పెసిఫికేషన్స్ : Specifications

motorola g 34 pdp flex view 3 a m ddxlia1t 1 Moto G34 5G Launch date: మోటో నుండి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తొందోచ్.

120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ తో ఉండే ఈ మొబైల్ 6.5 అంగుళాలు ఉంటుంది. దీనిని హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే తో రూపొందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ తో పనిచేస్తుంది.

ఇందులో ఉన్న ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్(Octa Core Snap Dragon) 695 ఎస్ఓసీ ద్వారా పవర్ ను అందుకుంటుంది. 695 చిప్‌సెట్‌తో ఇది ఉండటం వల్ల 5జి హ్యాండ్ సెట్ వేగవంతంగా పనిచేస్తుందని అంటున్నారు.

కెమెరా & ఇతర ఫీచర్లు : Camera & other features

ఈ ఫోన్ లో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంటుంది, అలాగే 2ఎంపీ మాక్రో సెన్సార్‌ తో నడిచే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కూడా దీని సొంతం.

Moto G34 5G 1 Moto G34 5G Launch date: మోటో నుండి మరో బడ్జెట్ ఫోన్ వచ్చేస్తొందోచ్.

సెల్ఫీ ప్రియులను దృష్టిలో పెట్టుకుని దీని ఫ్రంట్ సైడ్ లో 16ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

దీనికి అమర్చిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు డాల్బీ అట్మాస్ అనుభూతి కలిగిస్తాయి. ఇక దీని బ్యాటరీ ఇషయం చుస్తే 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఇందులో ఉంటుంది. సాధారణంగా ఈ తరహా బ్యాటరీలు త్వరగా ఛార్జింగ్ అవ్వడానికి, ఎక్కువసమయం బ్యాటరీ రావడానికి ఉపయోగపడతాయి.

Leave a Comment