Mrunal Thakur gave clarity on marriage: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్.
సీతారామం సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో సీతామహాలక్ష్మిగా తనదైన ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో ఇపుడు ప్రేక్షకుల్ని అలరిస్తోంది. వరుస సినిమాలతో వేరు వేరు భాషలలో ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంది.
ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండతో కలిసి ఫామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది.
తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే హిట్టు జాబితాలోకి చేరింది.
తెలుగులో సూపర్ హిట్ అయిన జెర్సీ సినిమాకి రీమేక్ లో నటించిన మృణాల్ ఠాకూర్, అక్కడ పెద్ద హిట్టు కొట్టింది. తద్వారా తెలుగులోకి అడుగుపెట్టిన ఈ తార, ఇపుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా గా ఉంది.
డిసెంబర్ 7వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాయ్ నాన్న పేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది.
తాజాగా ఫామిలీ స్టార్ షూటింగ్ కోసం న్యూ జెర్సీకి వెళ్లిన మృణాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హాయ్ నాన్న సినిమా గురించి చెప్పింది.
సీతా రామంలో సీత పాత్రని ప్రేక్షకులు ఇప్పటికి గుర్తు చేసుకుంటున్నారని చెప్పింది. ఇంతలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, మృణాల్ పెళ్లి గురించి ప్రస్తావించాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావన్న ప్రశ్నకి మృణాల్ నవ్వుతూ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పింది.
ఈ సమాధానంతో, మృణాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, ఎప్పుడు చేసుకుంటుంది, ఇలాంటి ప్రశ్నలతో నెట్టింట పెద్ద చర్చే మొదలైంది.
వీటన్నింటికి ఇక మృణాల్ మాత్రమే తెర తీయాలి మరి
సీరియల్ నటిగా కరీర్ ని మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ విట్టి దండు అనే మరాఠీ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత హిందీ, తెలుగు చిత్రాలలో నటించింది.