Mrunal Thakur: మత్తెక్కించే అందాలతో చిత్తు చేస్తున్న మృణాల్..ఫోటోలు వైరల్.

Mrinal is crazy with intoxicating beauty..photos are viral

Mrunal Thakur: మత్తెక్కించే అందాలతో చిత్తు చేస్తున్న మృణాల్..ఫోటోలు వైరల్.

మత్తెక్కించే అందాలతో చిత్తు చేస్తున్న మృణాల్..ఫోటోలు వైరల్.

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ఇక్కడమ్మాయి కాకపోయినా తెలుగింటి కట్టుు బొట్టుతో , వెండితెర మీద వైవిధ్యమైన నటనతో అందరిని మనసులను దోచేసుకుంటోంది.

ఈ భామ నిస్సందేహంగా అందరి హృదయాలను శాసిస్తోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మృణాల్ నటిగా తెలుగు ఇండస్ట్రీలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకునేందుకు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటోంది.

తన పాత్రకు న్యాయం చేసేందుకు నూటికి నూరు శాతం ప్రయత్నిస్తోంది. నటనతో పాటు ఫ్యాషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది ఈ చిన్నది.

అదిరిపోయే మోడ్రన్ అవుట్ ఫిట్స్ నుంచి ఎత్నిక్ వేర్ వరకు అన్నింటిని ధరించి అద్భుతమైన లుక్స్ తో మెస్మరైజ్ చేయగల సత్తా మృణాల్‌ సొంతం. ప్రతిసారి తనదైన వస్త్రధారణతో మృణాల్ ఠాకూర్ అందరి దృష్టిని దనవైపు తిప్పుకుంటుంది.

తాజాగా ఈ చిన్నది మిశ్రూ క్లాతింగ్ బ్రాండ్ నుండి అందమైన తెల్లని లెహెంగా ధరించి నెట్టింట్లో మంటలు రేపుతోంది. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

మృణాల్ ఠాకూర్ అద్భుతమైన డిజైనర్ లెహంగాలో ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన పూల నమూనాలు కలిగిన ఈ తెల్లని లెహంగాలో ఏంజెల్ లా మెరిసిపోతోంది చిన్నది.

ఈ అవుట్ ఫిట్ మృణాల్ అందాలను మరింత హైలెట్ చేస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ నుంచి ఈ లెహెంగాను సెట్ అయ్యే జ్యువెల్లరీని ఎంచుకుని అలంకరించుకుంది.

మెడలతో అవుట్ ఫిట్‎కు సెట్ అయ్యే చోకర్ నెక్లెస్‌ను పెట్టుకుంది. తన డ్రెస్సింగ్ కి తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది ఈ బ్యూటీ.

ఈ ఫోటో షూట్ చిత్రాలను మృణాల్ తన ఇన్‏స్టాగ్రామ్‎లో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను వర్ణిస్తూ నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

సీతా రామం మూవీతో సూపర్ క్రేజ్ దక్కించుకున్న మృణాల్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయి కేక పెట్టిస్తోంది. ఇప్పటికే నాని 30 హాయ్ నాన్న సినిమాలో మెరిసింది మృణాల్.

డిసెంబర 7న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా థియేటర్లలో దూసుకెళ్తోంది. మంచి ఫామ్‌లో ఉన్న మృణాల్‌కు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచిందని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం నానీతో చేసిన హాయ్ నాన్న సినిమా హిట్ కొట్టడంతో ఈ భామ లేటెస్టుగా విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్లా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ముందుగా ఈ మూవీలో పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారట. విజయ్ కూడా పూజానే రిఫర్ చేశాడట.

Add a heading 2023 12 11T105014.848 Mrunal Thakur: మత్తెక్కించే అందాలతో చిత్తు చేస్తున్న మృణాల్..ఫోటోలు వైరల్.

అయితే ఏమైందో ఏమిటో కొన్ని కారణాల వల్ల సీతారామం బ్యూటీకీ ఓటేశారు మేకర్స్. ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ మూవీతో పాటు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది మృణాల్. ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన రామ్ చరణ్ బుచ్చిబాబు సానాతో ఓ మూవీ చేయబోతున్నారు.

ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ నవంబర్‌లో ఈ కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఈ క్రమంలో ఈ మూవీలో హీరోయిన్‌గా మృణాల్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. మరోవైపు తమిళం‎లో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మూవీలో కూడా మృణాల్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. ఈ మూవీని మురగదాస్ డైరెక్ట్ చేస్తుండగా ,సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Comment