Mrunal Thakur: సోయగాలతో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్.

Mrinal Thakur growing vegetables with soybeans.


Mrunal Thakur: సీతారామం (Sitaramam)సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).ఇక్కడమ్మాయి కాకపోయినా తెలుగింటి కట్టుు బొట్టుతో , వెండితెర మీద వైవిధ్యమైన నటనతో అందరిని మనసులను దోచేసుకుంటోంది.

ఈ భామ నిస్సందేహంగా అందరి హృదయాలను శాసిస్తోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మృణాల్ నటిగా తెలుగు ఇండస్ట్రీలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకునేందుకు వైవిధ్యమైన సినిమాలను ఎన్నుకుంటోంది.

తన పాత్రకు న్యాయం చేసేందుకు నూటికి నూరు శాతం ప్రయత్నిస్తోంది. నటనతో పాటు ఫ్యాషన్ రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది ఈ చిన్నది.

అదిరిపోయే మోడ్రన్ అవుట్ ఫిట్స్ నుంచి ఎత్నిక్ వేర్ వరకు అన్నింటిని ధరించి అద్భుతమైన లుక్స్ తో మెస్మరైజ్ చేయగల సత్తా మృణాల్‌ సొంతం.

ప్రతిసారి తనదైన వస్త్రధారణతో మృణాల్ ఠాకూర్ అందరి దృష్టిని దనవైపు తిప్పుకుంటుంది. తాజాగా ఈ చిన్నది అందమైన గులాబీ రంగు లెహెంగా ధరించి నెట్టింట్లో మంటలు రేపుతోంది. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.

Gorgeous looks in pink dress: పింక్ డ్రెస్‎లో అందాలు వావ్


మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)అద్భుతమైన డిజైనర్ లెహంగాలో ఆకట్టుకుంటోంది. ఆకర్షణీయమైన పూల నమూనాలు కలిగిన ఈ గులాబీ రంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది.

ఈ అవుట్ ఫిట్ మృణాల్ మిరిమిట్లు గొలిపే అందాలు కుర్రాళ్లను మంత్రముగ్థులను చేస్తున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ నుంచి ఈ లెహెంగాకు సెట్ అయ్యే ఆభరణాలను ఎంచుకుని అలంకరించుకుంది.

మెడలతో అవుట్ ఫిట్‎కు సెట్ అయ్యే చోకర్ నెక్లెస్‌ను అలంకరించుకుంది. పెట్టుకుంది. తన డ్రెస్సింగ్ కి తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది ఈ బ్యూటీ.

ఈ ఫోటో షూట్ చిత్రాలను మృణాల్ తన ఇన్‏స్టాగ్రామ్‎లో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను వర్ణిస్తూ నెటిజన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Family star with rowdy boy : రౌడీ బాయ్ తో ఫ్యామిలీ స్టార్


సీతా రామం(Sitaramam) మూవీతో సూపర్ క్రేజ్ దక్కించుకున్న మృణాల్ (Mrunal Thakur), టాలీవుడ్ (Tollywood)లో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇప్పటికే నాని(Nani)హాయ్ నాన్న (Hai Nanna) సినిమాలో మెరిసింది మృణాల్. ఈ మూవీలో తన నటతో మరింత ఫాలోయింగ్ పెంచుకుంది. టాలీవుడ్ లో మృణాల్‌కు క్రేజీ ఆఫర్స్ తులుపుతడుతున్నాయి.

దీంతో రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచిందని టాక్ . ఈ భామ ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న ,పరశురామ్ పెట్లా (Parushuram Petla)సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ముందుగా ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde)ను హీరోయిన్ గా అనుకున్నారట. విజయ్ కూడా పూజానే రిఫర్ చేశాడట. అయితే ఏమైందో ఏమిటో కొన్ని కారణాల వల్ల సీతారామం బ్యూటీకీ ఓటేశారు మేకర్స్.

ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ (Family Star) అని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Crazy offfer with global star: గ్లోబల్ స్టార్‎తో క్రేజీ ఆఫర్


ఫ్యామిలీ స్టార్ మూవీతో పాటు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది మృణాల్. ఆర్ఆర్ఆర్ (RRR)లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన రామ్ చరణ్(Ram charan) బుచ్చిబాబు సానా(Buchhibabu)తో ఓ మూవీ చేయబోతోంది.

ప్రస్తుతం శంకర్(Shankar) రూపొందిస్తున్న (Game Changer) సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ నవంబర్‌లో ఈ కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

ఈ క్రమంలో ఈ మూవీలో హీరోయిన్‌గా మృణాల్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం. మరోవైపు తమిళం‎లో శివ కార్తికేయన్ (Shiva Kartikeyan)హీరోగా నటిస్తున్న మూవీలో కూడా మృణాల్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం.

ఈ మూవీని మురగదాస్ (Murugadas) డైరెక్ట్ చేస్తుండగా ,సంగీతం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichandran)అందిస్తున్నట్లు తెలుస్తోంది.

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) స్పీడు మామూలుగా లేదు. ఈ భామ వ‌రుసగా క్రేజీ ఆఫ‌ర్ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తాజాగా ఈ చిన్నది తమిళంలోనూ రెండు సినిమాలకు సైన్ చేసినట్లు వార్తలు వస్తున్ానయి.

ఆ రెండు సినిమాల్లోనూ లారెన్స్ (Lawrence)నే హీరో. లారెన్స్ హీరోగా ర‌మేష్ వ‌ర్మ (Ramesh varma) డైరెక్షన్ లో రూపొందుతున్న శ్రీ‌రామ ర‌క్ష‌ (sri rama raksha) అనే సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది మృణాల్.

ఇక త‌మిళ డైరెక్టర్ ర‌వికుమార్‌ (Ravi kumar)తో లారెన్స్ ఓ సినిమా తీస్తున్నాడు అందులోనూ మృణాల్‌నే హీరోయిన్ అని టాక్.

Leave a Comment