Mrunal Thakur :ప్రభాస్ మూవీలో ఆ యంగ్ బ్యూటీ…క్రేజీ కాంబో అదుర్స్

mrunal thakur with prabhas 1710149959 Mrunal Thakur :ప్రభాస్ మూవీలో ఆ యంగ్ బ్యూటీ…క్రేజీ కాంబో అదుర్స్

‘సీతారామం’ (Setharamam)సినిమాతో తెలుగువారి హృదయాలను దోచేసింది నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). తన నటన, అందంతో ఇండస్ట్రీలో మంచి మార్కులు కొట్టేసింది. టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ తోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకుంది. నార్త్ బ్యూటీ అయిన చక్కని చీరకట్టుతో తెలుగుమ్మాయిలా కనిపించింది.

ఇక ఈ సినిమా తర్వాత ఈ చిన్నది కాస్త గ్యాప్ తీసుకున్నా మళ్లీ నాని (Nani )మూవీ హాయ్ నాన్న తో (Hai Naanna ) తో మరో హిట్ కొట్టి క్రేజ్ సంపాదించుకుంది. ఇక మృణాల్ కు ఇప్పుడు వరుసపెట్టి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మృణాల్, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) హీరోగా త్వరలో రిలీజ్ అవుతున్న ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమాతో మరోసారి పలకరించనుంది. ఇదిలా ఉంటే మృణాలకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. డార్లింగ్ ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ప్రభాస్‎తో యంగ్ బ్యూటీ :

సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghvapudi)తీసే నెక్స్ట్ మూవీలో మృణాల్ (Mrunal)ను సెలెక్ట్ చేశారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి లేటెస్ట్ ప్రాజెక్టులో ప్రభాస్ (Prabhas) నటిస్తున్నాడు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో మృణాల్ హీరోయిన్ గా ఎంపికైనదని తెలుస్తోంది. ప్రస్తుతం
‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)ప్రమోషన్ లలో ఈ బ్యూటీ బాగా బిజీ గా ఉంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ప్రభాస్ తో జోడీ కొట్టేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ప్రభాస్ జోరు మామూలుగా లేదు :

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే సలార్ తో బాక్సాఫీస్ లో ఓ రేంజ్ లో దుమ్ముదులిపాడు. ఇప్పుడు వరుసగా కల్కి (Kalki), రాజాసాబ్ (Rajasaab)షూటింగ్స్ లతో బిజీగా ఉంటున్నాడు. కల్కి మూవీ షూటింగ్ ఇప్పటికే ఎండింగ్ కు వచ్చింది. మరికొన్ని రోజుల్లోనే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ తర్వాత రాజా సాబ్ ను పూర్తి చేసి ఆ తర్వాత మరిన్ని ప్రాజెక్ట్స్ షురూ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారు.

సలార్ 2 శౌరాంగ్యపర్వం (Shourangyaparvam)తోపాటు.. స్పిరిట్ (Spirit)సినిమా కూడా పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభాస్ కు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రెండు సినిమాలే కాదు సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi)డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నారని టాక్ . ఇదొక అందమైన ప్రేమకథ.ఇందులో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)నటించనుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరో అందమైన ప్రేమకథ :

సీతారామం (Setharamam) వంటి మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi).ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోప్రత్యేక స్థానం ఉంది. దీంతో ఇప్పుడు హను రాఘవపూడి తర్వాత తీసే మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఓ అందమైన హృదయాలను హత్తుకునే ప్రేమకథను అందించిన హను ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీయబోతున్నాడని ఫ్యాన్స్ లో అసక్తి నెలకొంది. డార్లింగ్ తో నూ ఓ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నాడని తెలియడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి.

ఇప్పటికే ప్రభాస్ (Prabhas) , పూజా హెగ్దే (pooja Hegde)తో కలిసి రాథేశ్యామ్ (Radheshyam)అనే ప్రేమ కథ చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అయినప్పటికీ ప్రభాస్ డేర్ చేస్తూ ఈ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా హను డైరెక్షన్ లో వస్తుండటంతో ఖచ్చితంగా హిట్ కొట్టి తీరుతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Leave a Comment