Muhammed Riswan: సరదాగా రీల్ చేశాడు దెబ్బకు వరల్డ్ ఫెమస్ అయ్యాడు.

He made a fun reel and became world famous.

Muhammed riswan: సామజిక మాధ్యమాలలో బాగా పాపులారిటీ ఉన్న వాటిలో ఇన్​స్ట్రాగ్రామ్ ఒకటి ఎందుకంటే, ఇందులోనే రీల్స్ చేస్తారు ఎక్కువ మంది, ఈ ప్రపంచానికి తెలియని చాలామంది ఈ రీల్స్ ద్వారానే తమను తాము ఫెమస్ చేసుకున్నారు.

ఒకప్పుడు టిక్ టాక్ లో రీల్స్ చేసేవారు ఎక్కువ మంది. ఆ టిక్ టాక్ యాప్ బ్యాన్ అవ్వడం వల్ల ఇన్​స్ట్రాగ్రామ్ ను ఆశ్రయించారు. అనేకమంది ఔత్సాహిక కళాకారులు ఈ రీల్స్ ను ఆశ్రయించి తమలోని స్పెషల్ టాలెంట్ ను బయటపెట్టుకున్నారు.

కేవలం డాన్స్ చేయడం, పాటలు పాడటం, సినిమా డైలాగులు చెప్పడం మాత్రమే కాకుండా రకరకాల విన్యాసాలు చేస్తూ కూడా రీల్స్ చేసి ఫెమస్ అయిన వారు ఉన్నారు.

అయితే ఈ రీల్స్ చేయడం ద్వారా ఎవరికీ ఎక్కువ వ్యూస్ వస్తే వారి రీల్ మరింత వైరల్ అవుతూ ఉంటుంది. దానిని చూసి ఆశ్చర్యపోయిన వారు మరికొంతమందికి షేర్ చేస్తూ ఉంటారు.

ఇక ఇక్కడ ఒక విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రీల్స్ చేయడం వల్ల ఎక్కువ వ్యూస్ వచ్చిన వారు బాగా ఫెమస్ అవుతూ ఉంటారు.

అంతే కాదు రీల్స్ ద్వారా మిలియన్స్ కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకున్నవారి పేరు మీద రికార్డులు కూడా నమోదయ్యాయి. కానీ కేరళకి చెందిన ఓ కుర్రాడు ఇప్పడు ఆ రికార్డులను బద్దలు కొట్టేశాడు. అతనిపేరు మొహమ్మద్ రిజ్వాన్.

రిజ్వాన్ ఫుడ్ బాల ప్రేమికుడు : Rizwan Is A Foot Ball Lover

ఇంతకీ రిజ్వాన్ ఎం చేశాడంటే, తన ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడేందుకు ఒక చోటికి వెళ్ళాడు, అక్కడ వారికి ఒక జలపాతం కనిపించింది.

వెంటనే ఫుడ్ బాల్(Foot Ball) బయటకు తీసి ఒక్క కిక్ ఇచ్చాడు. అవును క్రికెట్ ఆడటానికి వెళ్లిన రిజ్వాన్ వద్ద క్రికెట్ బాల్ (Cricket Ball) కదా ఉంటుంది ఫుడ్ బాల్ ఎందుకు ఉంది అని సందేహం కలగొచ్చు.

అతనికి క్రికెట్ ఆడటం తో పాటు ఫుడ్ బాల్ ఆడటం కూడా చాలా సరదా. అందుకే ఎక్కడికి వెళ్లినా కూడా తనతోపాటు ఫుడ్ బాల్ తీసుకుని వెళుతూ ఉండేవాడు.

అలా అతను వాటర్ ఫాల్ వద్ద తన ఫుడ్ బాల్ బయటకు తీసి ఆడాడు. ఆడటం తోపాటు రీల్ చేశాడు. ఆ ఫుడ్ బాల్ ను రెండు బండ రాళ్ళ మధ్య కి వెళ్లేలా కొట్టాడు.

ఆ బంతి ఒక బండరాయికి తగిలి మరో బండరాయిని కొట్టుకుని, వాటర్ ఫాల్ మీద పడింది. ఆ వాటర్ ఫాల్ ప్రవాహం వేగానికి ఆ బంతి తిరిగి రిజ్వాన్ వద్దకే వచ్చింది.

లక్షల్లో ఫాలోవర్స్ ను తెచ్చిపెట్టింది (It Brought Lakhs Of Followers)


ఈ వీడియో ను రీల్ గా ఇన్​స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇది చుసిన ప్రతి ఒక్కరికి నచ్చేసింది. ముఖ్యంగా ఫుడ్ బాల్ ప్రియులను ఇంకా ఎక్కువగా ఆకర్షిస్తోంది.

ఈ రీల్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. కేవలం వ్యూస్ దక్కించుకోవడమే కాదు, అతనికి చాలా మంది ఫాలోవర్స్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది.

ఈ ఫుడ్ బాల్ వీడియో పుణ్యమా అని రిజ్వాన్ కూడా చాల ఫెమస్ అయిపోయాడు. పైగా ఇందులోని విచిత్రం ఏమిటంటే బంతిని కొట్టే సమయంలో కానీ, ఆ బంతి రెండు బండరాళ్ల మధ్య కి వెళ్లిన సమయంలో గాని వారు ఎటువంటి మాటలు మాట్లాడలేదు.

కేవలం హావభావాలను మాత్రమే వ్యక్తపరిచారు. దీంతో అది ఏ ఒక్క భాషకు పరిమితం కాకుండా మరింత ఎక్కువ మందికి చేరువైంది. ఆ కారణమే దీనికి ఇంత పెద్ద స్థాయిలో వ్యూస్ తెచ్చి పెట్టిందని కొందరు అంచనా వేస్తున్నారు.

360 మిలియన్ వ్యూస్ అంటే మాటలు కాదు : Not An Easy Thing To Touch 360 Millions Views

పైగా ఈ రీల్ ఇప్పటివరకు రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో వ్యూస్ ను దక్కించుకుంది. 360 మిలియన్ వ్యూస్(360 Millions Views) మార్క్ ను దాటి పోయి 400 మిళియన్స్ మార్క్ కి దగ్గరలో ఉంది.

ఇది నిజంగా అద్భుతమే అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఇన్​స్ట్రాగ్రామ్ లో ప్రపంచ రికార్డును(World Record) క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఎక్కువ వ్యూస్ తెచ్చుకున్న రీల్ గా ‘లర్న్ ఫ్రమ్ ఖబీ’(Learn From Kabhi) అనే ఇన్​స్ట్రాగ్రామ్ ఖాతా నుండి ఉంది.

కానీ ఇప్పుడు రిజ్వాన్ చేసిన వీడియో ఆ రికార్డును బద్దలు కొట్టేసి జోరుగా దూసుకెళుతోంది. కేవలం రికార్డు క్రియేట్ చేయడమే కాదు ఏకంగా రిజ్వాన్ కు ఐదు లక్షల ఫాలోవర్స్ ను తెచ్చిపెట్టింది.

అన్నట్టు రిజ్వాన్ కి ఇన్​స్ట్రాగ్రామ్ లో ఉన్న అకౌంట్ పేరు చెప్పలేదు కదూ, అతని అకౌంట్ పేరు ఫుట్​బాల్ ఫ్రీస్టైలర్(Foot Ball Freestyler).

రిజ్వాన్ కొత్త టార్గెట్ ఫిక్స్ చేశాడు : Rizwan fixed a new target

ఒకప్పుడు రిజ్వాన్ ఇన్​స్ట్రాగ్రామ్(Instagram) అకౌంట్ లో చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు ఉన్నట్టుండి అమాంతం పెరిగిపోయారు.

రిజ్వాన్ కూడా ఆల్ మోస్ట్ వరల్డ్ ఫెమస్ అయిపోయాడు. రిజ్వాన్ అకౌంట్ ను ఫాలో అయిన వారు అతని ప్రీవియస్ రీల్స్ కూడా చూడటం మొదలు పెట్టారు.

ఒక్క రీల్ అతడిని ఇంతలా ఫెమస్ చేసేయడంతో రిజ్వాన్ ఉబ్బి తబ్బిబవుతున్నాడు. ప్రస్తుతం రిజ్వాన్ పాత రికార్డులను తిరగరాసి ఇన్​స్ట్రాగ్రామ్ ఖాతాదారులకు ఒక కొత్త టార్గెట్ ఫిక్స్ చేశాడు.

ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఇన్​స్ట్రాగ్రామ్ అకౌంట్ ఉన్నవారు, అందులో ఫెమస్ అయిన వారు ఇప్పటి నుండి పోరాటాలు మొదలు పెట్టేస్తారేమో చూడాలి.

Leave a Comment