Mukesh Ambani : అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు మెయిల్.. మెయిల్ చేసిన వారిలో తెలంగాణ కుర్రాడు కూడా.. మరి పోలీసులు ఏం చేశారు..
కాయలు ఉన్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అని ఊరికే అనలేదు పెద్దలు. ఇప్పుడు ఈ సామెత ఎందుకు గుర్తొచ్చిందా అని అనుమానం రావచ్చు.
అపరకుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్స్ వచ్చాయట. 400 వందల కోట్లు ఇవ్వకపోతే కుటుంబం మొత్తాన్ని లేపేస్తాం అంటూ మెయిల్ ద్వారా ధమ్కీ ఇచ్చారట దుండగులు.
అయితే అలా బెదిరింపులకు పాల్పడిన ప్రబుధుల్లో ఒకడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడు కావడం విశేషం. మరొరు గుజరాత్ కు చెందిన వ్యక్తి.
అయితే అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్ రావడం కానీ, వారి పై హత్యా ప్రయత్నాలు చేయడం కానీ ఇది మొదటి సరి కాదు.
2021 లో ముకేశ్ అంబానీ నివాసం ఆంటీలియా దగ్గరలో ఎస్ యూ వీ వాహనం పార్క్ చేసి ఉండటాన్ని గుర్తించారు. వారికి అది అనుమానాస్పదంగా తోచడంతో తనిఖీ చేశారు.
ఆ కారులో వారికి పేలుడు పదార్ధాలు కనిపించడంతో విస్తు పోయారు. ఇది హత్యా ప్రయత్నమే కావడంతో మరింత అప్రమత్తమయ్యారు. అయితే ఇవి అంతటితో ఆగిపోలేదు.
2022 లో రిలయన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్ హెచ్ ఎన్ ఫౌండేషన్ హాస్పిటల్ కు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఆ కాల్ లో ఆసుపత్రిని కూల్చేస్తామని బెదించారు.
ఐతే డబ్బు కావాలని గాని నగలు కావాలని గాని డిమాండ్ చేయలేదు. ఇక ఆ ఫోన్ కాల్ పై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన పోలీసులు ఆనతి కాలంలోనే నిందితున్ని పట్టుకున్నారు. అతగాడు ముంబైకి చెందిన ఒక నగల వ్యాపారి అని గుర్తించారు.
ఇక 2023 విషయానికి వస్తే వరంగల్ కి చెందిన 19 సంవత్సరాల వయసున్న ఒక యువకుడు అంబానీ కి చెందిన అధికారిక మెయిల్ కి ఒక సందేశాన్ని పంపించాడు.
అందులో 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని వ్రాసాడు. కానీ ఆ మెయిల్ ను ఎవ్వరు పట్టించుకోలేదు. దీంతో మరో మెయిల్ చేశాడు. తన మెయిల్ ను పట్టించుకోని కారణంగా 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అక్కడి తో ఆగకుండా దానిని 400 కోట్ల వరకు పెంచేశాడు. దీంతో రంగం లోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ నేరానికి పాల్పడింది వనపర్తి గణేశ్ రమేశ్ అనే కుర్రాడని కనుగొన్నారు.
ఈ విషయాన్నీ వరంగల్ పోలీసులకు అందించగా వారు గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు.ఇక మరో నిందితుడు షాదాబ్ ఖాన్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సదరు నిందితులిద్దరు వేర్వేరు మెయిల్ ఐడీలను ఉపయోగించి ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. గణేశ్ వనపర్తిని పోలీసులు కోర్టు లో ప్రవేశపెట్టారు.
‘కేసును పరిశీలించిన న్యాయస్థానం గణేష్ ను నవంబర్ 8 వరకు పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించింది. షాదాబ్ ఖాన్ విషయానికి వస్తే ఇతగాడు బాగానే చదువుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితులిద్దరిపైన సెక్షన్లు 387, 506 (2) కింద కేసు నమోదు చేశారు.
ఇలాంటి వారిని ఏ మాత్రం ఉపేక్షించినా మరికొంత మంది ఆకతాయిలు ఇలానే బెదిరింపులకు పాలపడతారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.’కేసును పరిశీలించిన న్యాయస్థానం గణేష్ ను నవంబర్ 8 వరకు పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతించింది.
షాదాబ్ ఖాన్ విషయానికి వస్తే ఇతగాడు బాగానే చదువుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితులిద్దరిపైన సెక్షన్లు 387, 506 (2) కింద కేసు నమోదు చేశారు.
ఇలాంటి వారిని ఏ మాత్రం ఉపేక్షించినా మరికొంత మంది ఆకతాయిలు ఇలానే బెదిరింపులకు పాలపడతారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.