Mumbai Slum To Hollywood: మురికి వాడ నుండి వచ్చా..ఛాన్స్ ఇస్తే హాలీవుడ్ ను ఏలేస్తా.

Coming from a dirty man..if given a chance he will rule Hollywood.


Mumbai Slum To Hollywood: మనసుంటే మార్గముంటుంది, కృషి ఉంటె మనుషులు ఋషులవుతారు అనే మాటలు మాలీషా ఖార్వా ను చూసి పుట్టుకొచ్చాయేమో.

ఎందుకంటే మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం ముమ్మాటికీ మన తప్పే.

మన లో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి చూపించి అవకాశాలను కొల్లగొట్టి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందని మరో సారి రుజువు చేసింది మాలీషా (Malisha),

పద్నాలుగేళ్ల ఈ చిన్నది, ముంబై, (Mumbai) లోని మురికివాడ అయిన దారవి (Daravi) లో పుట్టి పెరిగింది. ఎప్పటికైనా మోడల్ అవ్వాలన్నది ఈ అమ్మాయి కల, తన కృషి, పట్టుదలతో తన కలను సాకారం చేసుకుంది. తాను కోరుకున్నట్టుగానే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

ప్రియాంక చోప్రాను (Priyanka Chopra) ఆదర్శంగా తీసుకున్న ఈ సిసింద్రీ ఆమెకు మాదిరిగానే ఏకంగా హాలీవుడ్ సినిమాలో అవకాశం కూడా కొట్టేసింది. ముంబై టు హాలీవుడ్ ప్రయాణాన్ని మాలీషా ఎలా సాధించగలిగింది అన్నది ఒక్కసారి చూద్దాం.

పూరి గుడిసె నుండి మ్యాగజైన్ కవర్ పేజ్ కి : Poor Family To Magazine Cover Page

ప్రతిభకు కొలమానం లేదని ఓ పెద్ద మనిషి చెప్పినట్టు టాలెంట్ ఉన్నోడిని ఎవ్వడు ఆపలేదు, దానికి డబ్బుతో అస్సలు పనిలేదు.

images 2024 01 09T145249.984 Mumbai Slum To Hollywood: మురికి వాడ నుండి వచ్చా..ఛాన్స్ ఇస్తే హాలీవుడ్ ను ఏలేస్తా.

టాలెంట్ లేకపోతే ఆగర్భశ్రీమంతులైనా వారు వారి ఇంటికి మాత్రమే పరిమితం అవుతారు. కానీ ప్రతిభ, దానికి తగిన ప్రోత్సాహం, సరైన అవకాశాలు దక్కాలే కానీ పూరి గుడిసెలో ఉన్నవారు కూడా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతారు.

అలా అవకాశం తలుపు తట్టడంతో మాలీషా కూడా వరల్డ్ ఫెమస్ అయిపొయింది, ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద ఆమె ఫోటోలు ప్రింట్ చేసే స్థాయికి చేరుకుంది. అంతకి మించిన విషయం ఏమిటంటే ప్రముఖ బ్యూటీ బ్రాండ్ ఫారెస్ట్ ఎసెన్షియల్ (Forest Essential) కి మోడల్ గా కూడా ఎంపికైంది.

ఇంత పాపులారిటి మూలం ఆ షార్ట్ ఫిలిం – The source of such popularity is that short film

మాలీషా పుట్టింది ఓ పూరి గుడిసె లో, నిరుపేద కుటుంబం, చిన్నప్పటి నుండే ఆకలి బాధలు చవిచూసింది. అయినా ఆమెకు ఉన్న లక్ష్యం ఒక్కటే ఫ్యూచర్ లో మంచి మోడల్ అవ్వాలని,

ఆర్ధిక పరిస్థితులు వెనక్కి లాగుతున్న, కృషి పట్టుదల ఆమెకు ముందుకు పరుగులు పెట్టించాయి. ఆమె సాధించిన విజయం పేదరికాన్ని వెక్కిరించేలా చేసింది.

అసలు మాలీషా ఖార్వ (Malisha Kharva)కి ఇంతటి పాపులారిటీ రావడానికి బీజం ఎక్కడ పడింది, ఆమె లైఫ్ ను టర్న్ చేసిన అంశం ఏది అని డౌట్ రావచ్చు.

102629072 Mumbai Slum To Hollywood: మురికి వాడ నుండి వచ్చా..ఛాన్స్ ఇస్తే హాలీవుడ్ ను ఏలేస్తా.

ఆ వివరాలు చుస్తే, మలిషా మొట్టమొదటిసారిగా లైవ్ యువర్ ఫెయిరీ టేల్స్ (Live Your Fairy tales) అనే షార్ట్ ఫిలిం ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం అయింది.

ఆ షార్ట్ ఫిలిం గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే పేదరికంలో ఉన్న ఐదుగురు చిన్నారులను స్టార్ హోటల్ కి తీసుకెళ్లి ఫుడ్ తినిపిస్తే వారి అనుభవాలు ఎలా ఉంటాయి అన్నది కధాంశం. ఆ ఐదుగురు చిన్నారుల్లో మాలీషా కూడా ఒకటి.

మాలీషా జీవితాన్ని మార్చిన నటుడు – That Actor Changed Malisha Life

ఇక 2020 లో రాబర్ట్ హాఫ్ మన్ (Robert Holf Man) అనే హాలీవుడ్ నటుడు ముంబై వచ్చాడు, ఆసమయంలో అతడి కంట్లో పడింది ఈ పేదింటి కలువ, ఆమె ప్రతిభను చూసి అతనికి ముచ్చటేసింది,

maleesha banner 1080x640 1 Mumbai Slum To Hollywood: మురికి వాడ నుండి వచ్చా..ఛాన్స్ ఇస్తే హాలీవుడ్ ను ఏలేస్తా.

నువ్వు ఎం కావాలనుకుంటున్నావ్ అని అడిగితే, తడుముకోకుండా మోడల్ అవ్వాలని అనుకుంటున్నా అని చెప్పింది. దీంతో రాబర్ట్ వెంటనే ఆమె పేరు మీద ఒక ఇన్స్టాఐడి(Insta ID) క్రియేట్ చేశాడు.

ఆమెకు తగిన ప్రోత్సాహం అందించాలని అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాకి ఉన్న బలం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాలా ? ఆ బలమే మాలీషాను ప్రపంచానికి దగ్గర చేసింది. ఆమెకు తగిన సహాయసహకారం అందేలా చేశాయి.

సెలెబ్రెటీ హోదా వచ్చేసింది – Malisha Got Celebrity Status

మాలీషా టాలెంట్ చూసి చిన్న చిన్న కంపెనీలు ఆమెను మోడల్ గా పెట్టుకోవడానికి రెడీ అయ్యాయి. మోడలింగ్ లో బిజీ అయిన మలిషా ప్రిన్సెస్ ఫ్రమ్ స్లం (Princes From Slum) గా మారింది.

నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు మాలీషా టాలెంట్ ను గుర్తించి ఆమె పై స్పెషల్ ప్రోగ్రామ్స్ చేశాయి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ బ్యూటీ కి రెండు లక్షల 35 వేల ఫాలోవర్స్ ఏర్పడ్డారు.

ఒకప్పుడు తమ ఏరియాలో సినిమా షూటింగ్స్ జరుగుతుంటే చూడ్డానికి వెళ్ళేది మాలీషా, అయితే ఇప్పుడు తానే రెండు హాలీవుడ్ సినిమాలకి సైన్ చేసింది.

ఒకప్పుడు సినిమా సెలబ్రెటీలను చూడ్డానికి ఎగబడిన మాలీషా ఇప్పుడు అదే సెలెబ్రెటీ హోదాలో ఇన్స్టా ఐడి కి డబుల్ బ్లూ టిక్ తెచ్చుకోవడం చిత్రంగా ఉంది కదూ..

భవిష్యత్తులో తన జీవితం మరిన్ని మేలి మలుపులు తిరిగే అవకాశం ఉందని ఆశిస్తోంది ఈ స్లమ్ బ్యూటీ, సో మనం కూడా ఈ చిన్నదానికి ఆల్ ది బెస్ట్ చబుదాం.

Leave a Comment