Devara: ట్వీట్ తో దేవర హైప్ పెంచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.

Music director Anirudh who increased the hype of Devara with a tweet

Devara: ట్వీట్ తో దేవర హైప్ పెంచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.

RRR తరువాత దేవర :

RRR ఘనవిజయం తరువాత యంగ్ టైగర్ NTR నటిస్తున్న సినిమా దేవర కావడంతో, నందమూరి అభిమనులంతా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

RRR దేశవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర అంతకుమించిన అంచనాలతో భారీగా చిత్రీకరణ జరుగుతోంది.

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.
దేవర ద్వారా జాన్వి కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల ఒకలాంటి బజ్ ఉంది.

ఈ సినిమాకి సంబందించిన ఎటువంటి వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది.
ఇటీవల షూటింగ్ లో NTRకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రత్యేకంగా NTR లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

NEW YEAR కానుకగా DEVARA TEASER :

ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ఒక న్యూస్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. దానికి కారణం ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న అనిరుధ్ పెట్టిన ఒక్క ట్వీట్.

అదేంటంటే దేవర టీజర్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాను, పులిని అందరూ అభినందించాల్సిందే అంటూ ట్వీట్ చేస్తూ, NTR,

మరియు ఈ సినిమా దర్శకుడు కొరటాల శివను టాగ్ చేశాడు. దాంతో ఈ సినిమా గురించి మళ్ళీ హైప్ క్రియేట్ అయింది.ఈ ట్వీట్ తో NEW YEAR కానుకగా టీజర్ రబోతుందని అభిమానులు భావిస్తున్నారు.

Leave a Comment