MLA Sitaakka: నా ఉసురు తగిలింది..బి.ఆర్.ఎస్ గల్లంతయింది – ఎమ్మెల్యే సీతక్క.

My usury has been hit.. BRS has failed - MLA Sitakka.

MLA Sitaakka: నా ఉసురు తగిలింది.. బి.ఆర్.ఎస్ గల్లంతయింది – ఎమ్మెల్యే సీతక్క.

తెలంగాణ రాష్ట్రం లో సీతక్క పేరు తెలియని వారు లేరు అని చెప్పడంలో వింతేమీ లేదు. అయితే సీతక్క పక్కా తెలంగాణ ఆడపడుచే అయినా ఆమెకు పొరుగు రాష్ట్రం ఆంద్ర ప్రదేశ్ లో కూడా వీరాభిమానులు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తెలంగాణ రాష్ట్రంలోని బీ.ఆర్.ఎస్ పార్టీ చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆమె చేసిన పోరాటాలు తెలంగాణ బిడ్డలంతా కళ్లారా చూశారు.

ఇక ఆమె ప్రాతినిధ్యం వహించిన ములుగు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి అభ్యున్నతికి ఎంత మేర సాధ్యమవుతుందో అంత మేర పాటుపడ్డారు.

ఒక పక్క అసెంబ్లీలో కూడా ములుగు నియోజకవర్గ సమస్యలపై మాట్లాడుతూనే రాష్ట్ర సమస్యలపై కూడా తన గళం వినిపిస్తూనే వచ్చారు. ఒక్కరూపాయి కూడా అవినీతికి పాల్పడని నేత కడవం, ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వానికి ఎదురుతిరగడం వంటివి చేస్తూ గులాబీ బాస్ కి సీతక్క పంటి కింద రాయిలా తగులుతూనే వచ్చారు.

ఈ క్రమంలోనే జరిగిన ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు బలమైన నేతనే బరిలో దింపారు. తాజాగా ఈ విషయాలపై సీతక్క కూడా స్పందించారు. తన ఉసురు తగలడం వల్లే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందన్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసమే కొత్త ప్రభత్వం ఏర్పాటవబోతోందన్నారు. సీఎల్పీ లీడర్ ఎన్నిక జరుగుతున్నా నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తనను ఈ ఎన్నికల్లో ఓడించేందుకే ములుగులో ఎన్నో దురాగతాలు చేశారని మండిపడ్డారు.

ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి డబ్బును ఏరులుగా పారించారని, దాదాపు 200 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఇదంతా ఒకెత్తయితే ప్రజల దృష్టిలో తనను తక్కువ చేయడానికి అనేక కుట్రలకు తెరతీశారని అన్నారు.

ములుగు ప్రాంత ప్రజలకు తానూ చేసిన సేవలను కూడా అవమానించారని అన్నారు. అయితే గులాబీ బాస్ ఎన్నివిధాలుగా తనను దెబ్బ కొట్టాలని చూసినా తనకు ములుగు ప్రజలు అండగా ఉన్నారని, అందుకే తన జీవితంలో ములుగు ప్రజానీకానికి ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పుకొచ్చారు.

ములుగు ఓటర్లు అందించిన ఈ విజయాన్ని మర్చిపోలేనని అన్నారు. వారిపట్ల ఎల్లప్పుడు కృతజ్ఞత తో ఉంటానని పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ హయాంలో ములుగు నియోజకవర్గానికి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.

ములుగు నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం అనేది కేవలం మాటలకే పరిమితం కాదని చెప్పారు, ఈ మాట గెలిచినా సంతోషంలో చెబుతున్న మాట కాదన్నారు. ప్రచార సమయంలో కూడా మూలుగుకి ఆ ప్రాధాన్యత ఉందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ములుగు నుంచే మొదలు పెట్టారని అన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమే కాక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన విజయభేరీ కార్యక్రమాన్ని ములుగు నుండే మొదలు పెట్టారని గుర్తుచేశారు. కాబట్టి ములుగు ప్రాంత అభివృద్హిని విస్మరించే ప్రసక్తే లేదన్నారు.

Leave a Comment