Naa Saami Ranga Trailer Release Date: మోడ్రెన్ కటౌట్ తో మురిపించాలన్నా, విలేజ్ లుక్‌లో మెరిసిపోవాలన్నీ అది టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna)కే సొంతం. ఆరుపదుల వయసులోనూ ఆయన స్టైలే వేరు. అందుకే వెండితెర మీద మన్మథుడుగా ఏళ్లుగా రాణిస్తున్నాడు.
ఇండస్ట్రీలో ఎందమంది యువ హీరోలు ఉన్నా ఇప్పటికీ వారితో సమానంగా హ్యాండ్సమ్గా కనిపిస్తారు నాగ్. చాలా రోజులు గ్యాప్ తర్వాత నాగార్జున లేటెస్టుగా ‘నా సామిరంగ’ (Naa sami ranga)మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి బరిలో ఈ సారి తగ్గేదేలే అంటున్నారు సీనియర్ హీరో నాగార్జున.
సంక్రాంతికి కరెక్ట్ మూవీ ఇదే అని చాలా గట్టి నమ్మకంతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు నాగ్. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో వరుసగా హిట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.
రీసెంట్ గా మాస్ మహారాజ్ రవితేజ (Raviteja)నటించన ఈగల్ (Eagle)మూవీ సంక్రాంతి బరి నుంచి తప్పుకోగానే నా సామిరంగకు కలిసొచ్చినట్లైంది.
సినిమా థియేటర్ల సంఖ్య పెరగడంతో మేకర్స్ హరషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా ఇప్పటికీ ట్రైలర్ విడుదల కాలేదు. ఈ క్రమంలో ‘నా సామిరంగ.’ ట్రైలర్ విడుదల డేట్ పై మేకర్స్ అప్డేట్
Naa Samiranga trailer release date : నా సామిరంగ ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్
విజయ్ బిన్నీ (Vijay Binni) డైరెక్షన్ లో సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna),అమిగోస్ (amigos) బ్యూటీ అషికా రంగనాథ్
(Ashika Ranganath )లు నటించిన మూవీ ‘నా సామిరంగ’.ఈ మూవీపి సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పకప చేశారు.
ఈ క్రమంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ మధ్యనే మూవీ నుంచి పాటలను , పోస్టర్లను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.
ఇక మూవీ ట్రైలర్‌కి సంబంధించి అప్డేట్ను తాజాగా ఇచ్చారు. నా సామిరంగ ట్రైలర్‌ను( Naa sami ranga)
trailer )జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. జనవరి 9న మధ్యాహ్నం 3.15 గంటలకు ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్ చేశారు.
Choreographer Vijay Bunny as Director : డైరెక్టర్ గా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ
టాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా గత కొన్నేళ్లుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు విజయ్ బిన్నీ మొదటిసారిగా ‘నా సామిరంగ’ (Naa sami ranga ) సినిమాతో డైరెక్టర్ అవతారమెత్తాడు.
ఇప్పటికే రిలీజైన మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని టీజర్ ద్వారా తెలుస్తోంది.
విజయ్ బిన్నీ తన డెబ్యూ సినిమానే కింగ్ హీరోతో తీస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. కొత్త డైరెక్టర్ అయినా మ్యారట్ ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
నాగార్జున తో పాటు హీరోయిన్ల క్యారెక్టర్లను చాలా బాగా చూపించాడంటూ విజయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నాగ్ ఫ్యాన్స్.
Special Intro for Young Heros : యంగ్ హీరోలకు స్పెషల్ ఇంట్రో
నా సామిరంగలో నాగార్జునతో పాటు పలు కీలక పాత్రల్లో టాలీవుడ్ యంగ్ హీరోలు అల్లరి నరేశ్ (Allari Naresh ) రాజ్ తరుణ్ (Raj Tharun)నటిస్తున్నారు.
ఈ ఇద్దరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా పెద్దగా హిట్లు లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఇక్ బిన్నీ కూడా మూవీలో మెయిన్ రోల్ అయిన నాగార్జునకు (Nagarjuna ) సమానమైన క్యారెక్టర్లను క్రియేట్ చేసినట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. అంతే కాదు వీరిద్దరికీ స్పెషల్ ఇంట్రడక్షన్స్ కూడా ఉన్నట్లు టాక్.
ఈ సినిమాలో అంజి క్యారెక్టర్ లో అల్లరి నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నారు. ఇక హీరోయిన్లుగా గా అషికా రంగనాథ్ , మిర్నా మోహన్ (Mirna Mohan), రుక్సార్ (Ruksar )లు నటిస్తున్నారు.
గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై నాగ్ అభిమానుల్లో అంచనాలే భారీగానే ఉన్నాయి. ఈసారి సంక్రాంతికి హిట్ కొట్టడం ఖాయం అని నమ్ముతున్నారు. అందుకే ట్రైలర్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.