Naa sami ranga New song: దుమ్ముదులుపుతోన్న, దుమ్ము దుకాణం

Naa sami ranga New song

Naa sami ranga New song: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna)వయసు పెరుగుతున్నా కొద్దీ ఊపు మాత్రం తగ్గడం లేదు. ఏజ్ తో పాటే ఆయన స్టైల్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోతోంది. అందుకే వెండితెర మీద మన్మథుడుగా కొన్ని సంవత్సరాలుగా రాణిస్తున్నారు.

ఇండస్ట్రీలో ఎందమంది యువ హీరోలు ఉన్నా ఇప్పటికీ వారితో సమానంగా హ్యాండ్‎సమ్‎గా కనిపిస్తారు నాగ్. చాలా రోజులు గ్యాప్ తర్వాత నాగార్జున లేటెస్టుగా ‘నా సామిరంగ’ (Naa sami ranga)మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి బరిలో ఈ సారి తగ్గేదేలే అంటున్నారు సీనియర్ హీరో నాగార్జున.

సంక్రాంతికి కరెక్ట్ మూవీ ఇదే అని చాలా గట్టి నమ్మకంతో హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు నాగ్. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీపై హైప్ పెంచేందుకు ఒక్కోపాటను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి దుమ్ము దుకాణం (Dummu Dhukanam) అనే మాస్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఆ పాటు నెట్టింట్లో దుమ్ము దులిపేస్తోంది. నాగ్ నుంచి మాస్ సాంగ్ రావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ పాటకు తగ్గట్లుగానే ఊరమాస్ స్టెప్‌లతో సంక్రాంతి హీరోలు నాగార్జున, అల్లరి నరేష్(Allari Naresh), రాజ్ తరుణ్ (Raj Tharun) ఊగిపోయారు.

My father told me to do Naa Sami Ranga New song : నా సామిరంగా చేయమని నాన్న చెప్పారు

నా సామిరంగ (Naa sami ranga) సినిమా టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సినీ(Nagarjuna) కెరీర్లో చాలా ముఖ్యమైనదనే చెప్పాలి. 8 సంవత్సరాల క్రితం విడుదలైన సోగ్గాడే చిన్నినాయన (Soggade Chinninayana) మూవీ తర్వాత నాగ్ కు సరైన హిట్లు దక్కలేదు.

సోగ్గాడే తర్వాత దేవదాస్ (Devadas), బంగార్రాజు (Bangarraju)లాంటి మూవీస్ చేసినా అవి కూడా ఆవరేజ్ గానే అలరించాయి. నాగ్ కోరుకున్న బ్లాక్ బస్టర్స్ గా నిలవలేకపోయాయి. కొన్నేళ్లుగా నాగార్జునకు ఇండస్ట్రీలో చేదుఅనుభవమే ఎదురవుతోంది.

Naa sami ranga New song
Naa sami ranga New song

ఆయన నటించిన చాలా వరకు చిత్రాలన్నీ కూడా డిజాస్టర్లుగానే నిలిచాయి. ఈ నేపథ్యంలో నా సామి రంగ మూవీ ఆయనకు ఎంతో ప్రెస్టీజియస్ గా మారింది(Naa sami ranga New song). ఎలాగైనా హిట్ కొట్టాలని నాగ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు.

తాజాగా జరిగిన నా సామిరంగ ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా ఈ సినిమా హిట్ పక్కా అని ధీమాను వ్యక్తం చేశారు. ఈసారి సంక్రాంతికి హిట్ పక్కా అని క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాకి తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswar rao) ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పారు నాగార్జున. గత సంవత్సరం సెప్టెంబర్ లో ఏఎన్ఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నా సామిరంగా సినిమా చేయమంటూ తనకు తండ్రి మనసులో చెప్పినట్లు నాగ్ తెలపడం కొసమెరుపు. నాగార్జున ఈ మాట చెప్పడంతో ఆడిటోరియం ఫ్యాన్స్ అరుపులతో దద్దరిల్లింది.

Choreographer Vijay Binny as Director : డైరెక్టర్ గా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ

టాలీవుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా గత కొన్నేళ్లుగా గుర్తింపును సంపాదించుకున్నాడు విజయ్ బిన్నీ మొదటిసారిగా ‘నా సామిరంగ’ (Naa sami ranga ) సినిమాతో డైరెక్టర్ అవతారమెత్తాడు. ఇప్పటికే రిలీజైన మూవీ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని టీజర్ ద్వారా తెలుస్తోంది. విజయ్ బిన్నీ తన డెబ్యూ సినిమానే కింగ్ హీరోతో తీస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. కొత్త డైరెక్టర్ అయినా మ్యాటర్ ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

నాగార్జున తో పాటు హీరోయిన్ల క్యారెక్టర్లను చాలా బాగా చూపించాడంటూ విజయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నాగ్ ఫ్యాన్స్. ఈ మూవీలో హీరో నాగార్జున (Nagarjuna) సరసన, అమిగోస్ (amigos) బ్యూటీ అషికా రంగనాథ్ (ashika ranganath ) హీరోయిన్ గా నటిస్తోంది.

Special Intro for Young Heros : యంగ్ హీరోలకు స్పెషల్ ఇంట్రో

Naa sami ranga New song
Naa sami ranga New song

నా సామిరంగలో నాగార్జునతో పాటు పలు కీలక పాత్రల్లో టాలీవుడ్ యంగ్ హీరోలు అల్లరి నరేశ్ (Allari Naresh ), రాజ్ తరుణ్ (Raj Tharun)నటిస్తున్నారు.

ఈ ఇద్దరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా పెద్దగా హిట్లు లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక బిన్నీ కూడా మూవీలో మెయిన్ రోల్ అయిన నాగార్జునకు (Nagarjuna ) సమానమైన క్యారెక్టర్లను క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.

అంతే కాదు వీరిద్దరికీ స్పెషల్ ఇంట్రడక్షన్స్ కూడా ఉన్నట్లు టాక్. ఈ సినిమాలో అంజి క్యారెక్టర్ లో అల్లరి నరేశ్, భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నారు. ఇక హీరోయిన్లుగా గా అషికా రంగనాథ్ , మిర్నా మోహన్ (Mirna Mohan), రుక్సార్ (Ruksar )లు నటిస్తున్నారు.

గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై నాగ్ అభిమానుల్లో అంచనాలే భారీగానే ఉన్నాయి. ఈసారి సంక్రాంతికి హిట్ కొట్టడం ఖాయం అని నమ్ముతున్నారు. అందుకే ట్రైలర్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Leave a Comment