Naga Chaitanya: రష్మికకు బాసటగా చైతు.టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుంటే బాధగా ఉంది..వీడియోలోని అసలు భామ జారా పటేల్ ఏమందంటే.
రష్మిక మార్ఫిగ్ వీడియో అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీని ఈ అంశం కుదిపేస్తోంది. ఈ విషయంలో రష్మిక కు బాలీవుడ్ బాద్ షా అమితాబ్బచ్చన్, అలాగే భారతీయ రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమ సంఘీభావాన్ని తెలిపారు.
తాజాగా ఇప్పుడు అక్కినేని నాగార్జున నటవారసులలో ఒకరైన అక్కినేని నాగచ్ఛతన్య ఆమె కు బాసటగా నిలిచారు. ఈ వీడియోపై ఇప్పటికే ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా పెట్టేశాడు చై. ఆకతాయిలు టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే తనకు బాధగా నిరుత్సాహంగా ఉందని అంటున్నాడు.
బాధితులకు రక్షణ కల్పించాలంటే మరింత కఠినమైన కొత్త చట్టాలను తీసుకురావాలని అన్నాడు. ఇక గాయని చిన్మయి మాట్లాడుతూ ఇలాంటివి చాల ప్రమాదకరమన్నారు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీటిని ఇప్పటి నుండే అరికట్టలన్నారు.
ఇదే పోస్ట్ లో రష్మికకు చైతు ధైర్యం చెప్పాడు. ఈ పోస్ట్ పై రష్మిక స్పందించింది, చైతూకి ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చింది. పైగా తనకు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.
అంతే కాకుండా ఈ ఫేక్ వీడియోపై అందరికన్నా ముందుగా స్పందించిన సీనియర్ నటుడు అమితాబ్ కుప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. కేంద్ర ఐటీ శాఖ ఈ చర్యపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
36 గంటల్లోపు దీన్ని తొలగించాలని పేర్కొంటూ.. మార్ఫింగ్ అనేది చాలా ప్రమాదకరమైన చర్య అని వెల్లడించింది. అయితే ఒరిజినల్ వీడియో క్లిప్‌లో ఉన్న జరా పటేల్ కూడా స్పందించడం గమనించదగ్గ విషయం.
డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీని ఉపయోగించి తన శరీరానికి బదులు రష్మిక ముఖాన్ని అతికించిన వీడియో వైరలైందని, ఈ విషయాన్ని తాను కూడా గమనించానని పేర్కొంది.
ఈ విషయంలో తన ప్రమేయం ఎంతమాత్రమూ లేదని, జరిగిన దానికి తానూ చుంతిస్తున్నానని చెప్పింది. ఇంటర్నెట్‌లో వచ్చే దేనినీ గుడ్డిగా నమ్మొద్దని, ప్రతి విషయంలో నిజ నిర్ధారణ చాలా అవసరమని సూచించింది.
రాను రాను సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేయాలంటే భయంగా ఉందని తెలిపింది. ఇక జారా పటేల్ విషయానికి వస్తే ఈమె ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్.
బ్రిటిష్ ఇండియన్ అయిన ఈవిడగారి ఖాతాకు నాలుగు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.