నా పేరు సూర్య..ఈ రోజు శనివారం..ఈసారి నాని ఊరమాసే

website 6tvnews template 2024 02 24T174132.356 నా పేరు సూర్య..ఈ రోజు శనివారం..ఈసారి నాని ఊరమాసే

Natural Star Nani movie saripoda sanivaram glimps released : రేడియో జాకీగా కెరియర్‌ స్టార్ట్ చేసిఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. చేసే ప్రతి సినిమాలో కొత్తదనం కోరుకునే నటుడు నాని ( Nani ). తనని తాను కొత్తగా చూపిస్తూ అభిమానులని అలరిస్తుంటాడు. ఫ్లాప్స్ వచ్చినా మళ్లీ ఎలా నిలబడాలో నానికి బాగా తెలుసు.

పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అయ్యాడు. అందుకే నానిని అందరూ నాచురల్ స్టార్ అని పిలుస్తారు. గత ఏడాది నాని నటించిన రెండు సినిమాలు దసరా(Dasara),హాయ్ నాన్న (Hai Naanna )సూపర్ హిట్ కావడంతో నాని మంచి జోష్ లో ఉన్నాడు. ఇప్పుడేమో సరిపోదా శనివారం (Saripoda Sanivaram ) అంటూ అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇవాళ నాని పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ కి సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ నాని ఫ్యాన్స్ ను అమితంగా అలరిస్తోంది.

శనివారం పుట్టినరోజు..శనివారమే టీజర్ :

ఈ సంవత్సరం నాని (Nani ) బర్త్ డే శనివారం వచ్చింది. ఈ సినిమా టైటిల్ లోనూ శనివారం ఉంది. ఇక శనివారం కలిసి రావడంతో నాని బర్త్ డే గిఫ్ట్ గా టీజర్ ని ఈ రోజే విడుదల చేశారు మేకర్స్. నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ అదిరిపోయింది. ఇందులో నీ డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. నాని అయితే ఊర మాస్ లెవెల్లో ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు. ” కోపాలు రకరకాలు.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమ బద్ధంగా పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నా కొడుకును చూశారా.. నేను చూశా” అంటూ ఎస్‌జే సూర్య (SJ Surya)చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. “నా పేరు సూర్య.. ఈ రోజు శనివారం” అంటూ వచ్చే నాని ఇంట్రో అదిరిపోయింది. చివరికి సూర్యతో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ విషెస్ చెప్పించాడు డైరెక్టర్. పనిలో పనిగా మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

WhatsApp Image 2024 02 24 at 5.35.34 PM నా పేరు సూర్య..ఈ రోజు శనివారం..ఈసారి నాని ఊరమాసే

ఆ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇచ్చిన నాని :

అంటే సుందరానికి (Ante Sundaraniki ) మూవీని డైరెక్ట్ చేసిన దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Atreya)కే మళ్లీ అవకాశం ఇచ్చాడు నాని(Nani) ఈ మూవీలో తమిళ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Moham) హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్‌జే సూర్య(SJ Surya) కీలక పాత్రను పోషిస్తున్నారు. సాయి కుమార్ (Sai Kumar ) శుభ లేఖ సుధాకర్ (Subhaleka Sudhakar) తదితర సీనియర్ హీరోలు కూడా ఉన్నారు.ఆగస్టు 29న సరిపోదా శనివారం (saripoda sanivaram) మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ గ్లింప్స్ మూవీపై అంచనాలను పెంచేసింది. దసరా(Dasara )తర్వాత మరోసారి మాస్ లుక్ లో అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు నాని. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య(DVV Danayya)నిర్మిస్తుండగా, జేక్స్ బేజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Leave a Comment