అమెరికాలో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు

website 6tvnews template 2024 03 28T144555.856 అమెరికాలో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు

ఇటీవల జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందిరికీ తెలిసిన విషయమే ! ఇందులో నటించిన నవీన్ పోలిశెట్టి కి కూడా మంచి పేరు వచ్చింది. ఇక ఆ తర్వాత వరస పెట్టి ఎన్నో అవకాశాలు వచ్చాయి తెలుగు లో నవీన్ పోలిశెట్టి కి. ఈ మధ్యనే నవీన్ పోలిశెట్టి సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక యాక్సిడెంట్ లో నవీన్ పోలిశెట్టి కి దెబ్బలు తగలాయని సోషల్ మీడియా ద్వారా తలుస్తోంది.

అమెరికా లో ఒక వీధి లో బైక్ మీద వెళ్తుండగా స్కిడ్ అయ్యి బైక్ మీద నుండి కింద పడిపోయినట్లు వార్తలు అందుతున్నాయి. వెంటనే అతన్ని హాస్పిటల్ కి తరలించగా ఆయన చేతికి ఫ్రాక్చర్ అయినట్లు అక్కడ డాక్టర్ లు చెప్పారు. చేతికి బాగా బలమైన దెబ్బ తగలడం వలన కనీసం రెండు నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. దీని వల్ల కొంత కాలం పాటు షూటింగ్ లకు దూరం గా ఉండాలని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ యాక్సిడెంట్ అన్నది ఎంత వరకు నిజమో అన్నది హీరో నవీన్ పోలిశెట్టి చెప్పాల్సి ఉంది.

Leave a Comment