Indian Navy: విశాఖలో అలరించిన నావీ విన్యాసాలు..ముఖ్య అతిధిగా ఏపీ గవర్నర్.
విశాఖ పట్నం లోని ఆర్కే బీచ్ లో నావీ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నావీ విన్యాసాలలో భారత నేవీ, వాయు విభాగం, సైన్యం కూడా పాల్గొన్నాయి.
ప్రతి ఏటా విశాఖ సాగరతీరాన ప్రదర్శించే ఈ విన్యాసాలను ఈ ఏడాది కూడా చేపట్టారు, ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నేవీ విన్యాసాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆర్కే బీచ్ కు చేరుకోవడానికి ఉన్న ఎన్నియో రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ విన్యాసాల నేపథ్యంలో భారత నావీ యొక్క పరాక్రమాన్ని, ప్రతిభాపాఠవాలను అత్యద్భుతం గా అబ్బురపరిచే ఆ విన్యాసాలను తిలకించేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తీర ప్రాంతానికి శత్రువుల వల్ల ముప్పు వాటిల్లినప్పుడు ఎలా కాపాడతారు అనే దానిపై ఒక చిన్నపాటి ప్రదర్శన ఏర్పాటు చేశారు.
నేవీ కమాండోలు ఈ ప్రదర్శనలో స్వయంగా పాల్గొన్నారు. ఇక ఈ ప్రదర్శన లో భాగంగా పోరాటాలకు ఉపయోగించే తేలికపాటి హెలికాఫ్టర్లు, బి.ఎం.పీ యుద్ధ కంకర్లు, నావికి చెందిన బొట్లు, మీడియం లాండింగ్ షిప్పులు పాల్గొన్నాయి.