ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని డౌటా ?…అయితే ఈ టిప్స్ పాటించండి.
మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుందని అంటారు. అందుకని మనచుట్టూ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. పాజిటివ్ ఎనర్జీ కనుక మనతో ఉంటే మన ఆలోచనలు కూడా ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాం.
అదే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది అనుకోండి ఎప్పడూ నెగటివ్ ఆలోచనలు కలిగి.. ఇంట్లో చికాకులు, గొడవలు ఉంటూనే ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఎప్పడూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంది అంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందన్నమాట. దాన్ని తొలిగించి అనుకూలమైన ప్రభావాలను పొందాలంటే కొన్ని చిన్న చిన్న పనును ఇంట్లో చేయండి.
స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఎప్పుడూ ఇంట్లోకి రావాలి :
మనలో చాలామంది ఎప్పుడూ ఇంటి కిటికీలు, తలుపులూ మూసుకుని ఇంట్లేనే కూర్చుంటారు. కానీ అలా చేయడం వల్ల ఇంట్లో నకారాత్మక శక్తి పెరిగే అవకాశం ఉంది.
అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లో ధారళంగా వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఇంట్లోని కిటికీ తలుపులను, ఈశాన్యం వైపున ఉండే గది తలుపులను తెరవాలి. దానివల్ల లేలేత భానుడి కిరణాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి.
మంచి పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచింది. ఒకవేళ తలుపులు తెరిచే వీలు లేనప్పుడు కనీసం ఇంట్లో ఉన్న కిటికీ తలుపులను అయినా తెరిచి పెట్టుకోండి. పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో కలుగుతాయి.
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం:
కొంతమంది ఇల్లు చూస్తే కడిగిన ముత్యంలా ఉంటుంది. మరికొంత మందేమో అవసరం ఉన్నా లేకున్నా సరే అన్నీ వస్తువులను ఇంట్లోనే ఉంచుకుని గందరగోళంగా ఇంటిని ఉంచుకుంటారు.
కానీ ఇకపై అలా చేయకండి. మీకు అవసరం లేదు అనిపించిన వస్తువును కానీ బట్టలను కానీ వెంటనే తీసేయండి. వంటపాత్రల్లో కూడా పాడైపోయినవి, పగిలిపోయినవి ఉంటే అవన్నీ బయట పడేయండి.
చిరిగిపోయిన, కాలిపోయిన బట్టలను అస్సలు ఉంచుకోకండి, వాటిని ఎప్పుడూ వేసుకోకండి. పాడైపోయిన గడియారం ఇంట్లో అసలు ఉంచుకోవద్దు. ఇంట్లో వస్తువులు పెట్టే ప్రదేశాలన్నీ సరైన ప్రదేశాలలోనే ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోండి.
ఒకవేళ సరైన దిశలో అవి లేకుంటే వాటిని సరిచేసుకోండి. ఇక ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కూడా లోపలి నుంచి బయటవరకు శుభ్రం చేయండి. అలా చేయడం వల్ల ప్రతికూలతలు తగ్గిపోతాయి.
ఎప్పుడూ దేవుడి నామస్మరణ:
పొద్దున్న లేవగానే దైవనామస్మరణ వినడం లేదా చదవడం అనేది అలవాటు చేసుకోండి. ఒకప్పుడు మన ఇళ్లలో ఉదయం లేవగానే సుప్రభాతంతో, దేవుడి ప్రార్థనాగీతాలతో పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండేవి.
కానీ ఇప్పుడు చాలామంది ఇంట్లో నిద్రలేవగానే సినిమా పాటలను వింటున్నారు. అలా కాకుండా ఉదయం నిద్రలేవగానే శాస్త్రీయ సంగీతం కానీ, దైవానికి సంబంధించిన సంగీతాన్ని కానీ వినడానికి ప్రయత్నించండి.
ఓంకార శబ్దం, గాయత్రీ మంత్రం లాంటివి ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. ఇంట్లో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోండి. దైవానుగ్రహం ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. మనస్సు కూడా చాలా ప్రశాతంగా ఉంటుంది.
అదే విధంగా ప్రతి శుక్రవారం, గురువారం, ఆదివారం సాయం సమయంలో ఇంట్లో ప్రతిమూలలా ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల ప్రభావాలు తొలిగి సానుకూల ప్రభావం కలుగుతుంది.