Nepal Earthquake: నేపాల్లో సంభవించిన భారీ భూకంపం.. ఎంత మంది చనిపోయారంటే..
6.4 తీవ్రతతో నేపాల్ లో వచ్చిన భూకంపం ఆ ప్రాంతాన్ని అతలాకుతం చేసింది. భయంకరమైన ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 70 మంది ప్రాణాలు కోల్పయినట్టు తెలుస్తోంది.
మృతుల సంఖ్యా మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అక్కడి అధికారులు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే సంభవించిన మూడువ భూకంపం ఇది, దీని వల్ల వందలాది మంది గాయాల పాలయ్యారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు.
నేపాల్‌లోని జాజర్‌కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా అనేక ప్రాంతాల్లో సంభవించినట్టు తెలుస్తోంది. భూమి కంపించడం మొదలైన వెంటనే భయబ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.
అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణాలను అరచేతపట్టుకుని బిక్కుబిక్కుమంటూ జాగారం చేశారు.భూకంపం వల్ల అనేక ఇల్లు నేలమట్టం అయ్యాయి, అధికారులు సహాయ చర్యలు చేపట్టి వాటిని కొనసాగిస్తున్నారు.
జాజర్‌కోట్ జిల్లాలో 34 మంది, రుకుమ్ జిల్లాలో 36 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ప దహల్ ప్రచండ, విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
అక్కడి ప్రభుత్వం గత నెలలో సంభవించిన భూకంపంలో మరణించిన వారికి, నివాసాలు కోల్పోయిన బాధితులకు ఇంత వరకు పరిహారం చెల్లించలేదని, బాధితుల ద్వారా తెలుస్తోంది.
నేపాల్లో సంభవించిన భూకంపాల కారణంగా ఇళ్లు కూలడం ఒక ఎత్తయితే, భూమి కంపించిన సమయంలో కొండ చరియలు విరిగి జనావాసాల మీద పది అవి కూలిపోవడం మరో ఎత్తు.