కేంద్ర ప్రభుత్వం కొత్త పధకం – ట్రక్ డ్రైవర్లకు కొత్త బిల్డింగులు : New buildings for truck drivers

PTI01 02 2024 000051B 0 1704213619975 1706880571157 కేంద్ర ప్రభుత్వం కొత్త పధకం - ట్రక్ డ్రైవర్లకు కొత్త బిల్డింగులు : New buildings for truck drivers

హైవేలపై ప్రమాదాలు సంభవించడానికి ప్రధాన కారణాల్లో అతివేగం ఒకటైతే రెండవది అలసట, డ్రైవర్లు పగలు రేయి తేడాలేకుండా విసుగు విరామం లేకుండా లారీలు, కార్లు డ్రైవ్ చేయడం వల్ల ఎదో ఒక సమయంలో నిద్ర ముంచుకురావడం వల్ల కంటికి కునుకు వస్తుంది, అలంటి సమయంలోనే ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉంటాయి.

(New buildings for truck drivers) ఈ ప్రమాదాల వల్ల ట్రక్కు డ్రైవర్లు లేదా కార్ల డ్రైవర్లు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. దాంతో వారి కుటుంబాలు వీధిన పడక తప్పదు. కాబట్టి ఇలాంటి పరిస్థులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) నడుం బిగించింది. ట్రక్కు డ్రైవర్ల విశ్రాంతి నిమిత్తం దేశ వ్యాప్తంగా హైవేలపై వెయ్యి భవనాలు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేయనుంది.

స్వయంగా ప్రకటించిన ప్రధాని మోదీ : PM Modi Announced

ఈ విషయాన్నీ భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) స్వయంగా ప్రకటించారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో(Bharat Mobility Global Expo) 2024 సదస్సు లో పాల్గొన్న అయన మాట్లాడారు. ట్రక్కు డ్రైవర్లకు విశ్రాంతి అనేది చాలా కీలకమని చెప్పారు. అందుకే ప్రభుత్వం ఈ ప్రత్యేక పధకానికి శ్రీకారం చుట్టిందన్నారు.(New buildings for truck drivers) ట్రక్కు డ్రైవర్ల కోసం దేశవ్యాప్తంగా వెయ్యి కొత్త భవనాలు నిర్మిస్తున్నామని, ఆ భవనాల్లో విశ్రాంతి గదులు, ఆహారం, మంచి నీరు, టాయిలెట్ల సౌకర్యం మాత్రమే కాకుండా పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. ఇక ఈసదస్సులో 50 కిపైగా దేశాలకు చెందిన 800 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.

ఇకమీదట ఏసీ క్యాబిన్లు : From Now On Words AC Cabins

ట్రక్ డ్రైవర్ అంటే డ్రైవింగ్ చేసే సమయంలో నిత్యం ఇంజన్ హీట్ తో మగ్గిపోతూ ఉంటారు. వీరి అవస్థలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది.(New buildings for truck drivers) 2025 అక్టోబర్ తరువాత నుండి భారత్ లో తయారయ్యే ట్రక్కులన్నీ కూడా వాటి డ్రైవర్ కాబిన్ లు ఎయిర్ కండిషన్ తోనే ఉండాలని నిబంధన విధించారు. ఈమేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

Leave a Comment