New CM For Jharkhand: చంపయీ సొరేన్ గురించి తెలియని విషయాలు

ldkg8e1c champat rai governor 625x300 01 February 24 New CM For Jharkhand: చంపయీ సొరేన్ గురించి తెలియని విషయాలు

జార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్ అరెస్ట్ అయినా నేపథ్యంలో నూతన ముఖ్యమంత్రిగా చంపయీ సొరేన్(Champai Soren) ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడైతే కొత్త ముఖ్య మంత్రి ప్రమాణం స్వీకారం చేశారో అయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది.

80 స్థానాలు ఉండే జార్ఖండ్ అసెంబ్లీలో(Jharkhand Assembly) ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది, 48 స్థానాల బలంతో ఈ సంకీర్ణ ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తోంది. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఉన్న రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌ సి.పి.రాధాకృష్ణన్‌, చంపయీ సోరెన్‌ తో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత సీఎం చంపయీ సోరెన్‌ జేఎంఎం పార్టీకి చెందిన నేత.

హేమంత్ సొరేన్ అరెస్ట్ కి కారణం : Reason For Hemanth Soren Arrest

ఇక హేమంత్ సొరేన్(Hemant Soren) మనీ లాండరింగ్(Money laundering) కేసులో ఇరుక్కోవడం వల్లనే ఆ రాష్ట్రానికి కొత్త సీఎం రావలసి వచ్చింది. హేమంత్ సొరేన్ 600 కోట్ల రూపాయల విలువైన భూకుంభకోణం కేసులో చిక్కుకున్నారు. అక్రమార్జన మొత్తాన్ని అయన విదేశాలకు తరలించాడని ఈడీ ఆరోపించింది.

అయితే అధికార దుర్వినియోగం కేసులో తన చేతులకు బేడీలు పడటం ఖాయం అనుకున్న హేమంత్ తానె సీఎం పదవికి రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. కాగా ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అరెస్ట్ చేసింది.

కూటమిలో ఏయే పార్టీలు ఉన్నాయంటే : parties in the coalition?

ఎప్పుడైతే సీఎం అరెస్ట్ అయ్యాడో కొత్త సీఎం రావడం అనివార్యమే అవుతుంది. కాబట్టి ఆ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు తమ ఎమ్మెల్యేల బలాన్ని అసెంబ్లీలో చుపెట్టుకుందుకు ఆయా పార్టీలు ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటాయి. కాబట్టి జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం లోని ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు హైదరాబాద్(Hyderabad) తరలించడానికి రెడీ అయింది. ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.

వాస్తవానికి వీరు ఫిబ్రవరి ఒకటవ తేదీ నాటికే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా వాతావరణం ప్రతికూలంగా ఉండరంతో ఆలస్యం అయింది. ఇక జార్ఖండ్ అసెంబ్లీలో ఏయే పార్టీలకు ఎంతంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నది చుస్తే జేఎంఎం(JMM) – 29, బీజేపీ(BJP) – 26, కాంగ్రెస్‌(Congress) – 17, ఏఎస్‌జేయూ(ASJU) – 3, ఆర్‌జేడీ(RJD) -1, ఎన్‌సీపీ(NCP) -1, సీపీఐ (ఎంఎల్‌)(CPI ML) -1 ఉన్నారు. కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జేడీ -1, సీపీఐ (ఎంఎల్‌) ఉన్నాయి.

కొత్త సీఎం గురించి వివరాలు : Details About New CM

ఇక జార్ఖండ్ కొత్త సీఎం చంపయీ సొరేన్(Champai Soren) ఎవరు అయన నేపధ్యం ఏమిటి అన్న వివరాలు సెర్చ్ చేయడం నెట్టింట ఎక్కువగా కనిపిస్తోంది. ఆయన గురించి చెప్పాలంటే జార్ఖండ్(Jharkhand) లో చంపయీ సొరేన్ కు జార్ఖండ్ టైగర్ గా పేరు తెచ్చుకున్నాడు. అందుకు కారణం బీహార్(Bihar) నుండి జార్ఖండ్ కు ప్రత్యేక రాష్ట్రం కావాలని శిబూ సొరేన్(Shibu Soren) తో కలిసి వీరోచిత ఉద్యమం చేయడమే.

కేవలం 10 తరగతి వరకు మాత్రమే చదువుకున్న చంపయీ సొరేన్ ఇప్పటికే పలుమార్లు మంత్రిగా పనిచేశారు. 2010 లో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) హయాంలో అర్జున్ ముండా(Arjun Munda) క్యాబినెట్ లో మంత్రిగా పనిచేయగా, ఆతరువాత హేమంత్ సొరేన్ క్యాబినెట్ లో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు.

Leave a Comment